Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని గెయిల్ ఇండియా ఏకంగా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.1,083 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడిం చింది. ఆరోగ్యవంతమైన బ్యాలెన్స్ షీట్ కోసం, అదే విధంగా వాటాదారులకు మరింత మద్దతను ఇవ్వడానికి ఈ నిర్ణయం దోహదం చేయనుందని ఆ సంస్థ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.190 అందించనున్నట్లు పేర్కొంది. 2020-21లోనూ షేర్ల బైబ్యాక్‌కు రూ.1,046.35 కోట్లను కేటాయించింది. గెయిల్ భారత సహజ వాయువు సరఫరాలో ఏకంగా 74 శాతం వాటా కలిగి ఉంది.