Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరగనున్న బిస్కెట్ ధరలు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికే అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్యులపై మరింత భారం పడనుంది. బిస్కెట్, సబ్బులు, సర్పుల (డిటర్జెంట్) ధరల పెంచనున్నట్లు ఆయా కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి. ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) కంపెనీ సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచినట్లు వెల్లడించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతో వీటి ధరలను 3-5.5 శాతం మేర హెచ్చించినట్లు తెలిపింది. దీంతో హెచ్‌యుఎల్ ఉత్పత్తి చేసే సర్పెక్సల్, వీల్ డిటర్జెంట్ పౌడర్లతో పాటు డవ్, లక్స్, పేర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి సబ్బుల ధరలు కూడా పెంచనున్నట్లు తెలిపింది. సబ్బుల తయారీలో ఎక్కువగా ఉపయోగించే పామాయిల్ ధరలు పెరగడంతో తమ ఉత్పత్తులను ధరలను సమీక్షించినట్లు తెలిపింది. హెచ్‌యుఎల్ తరహాలోనే ఈ రంగంలోని ఇతర కంపెనీలు ధరలు పెంచే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అతి త్వరలో బిస్కెట్ ధరలు పెరగనున్నట్లు ఈ రంగంలోని కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి. దేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత బిస్కెట్ల ధరలు పెరిగాయి. ఆ తర్వాత తాజాగా మళ్లీ పెంపునపై దృష్టి పెట్టాయి. దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ల తయారీదారు బ్రిటానియా ఇండిస్టీస్ లిమిటెడ్ తమ ఉత్పత్తుల ధరలను 7 శాతం మేర పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్రిటానియా నికర ఆదాయంలో 19 శాతం తగ్గుదలను చవి చూసింది. ద్రవ్యోల్భణ ప్రభావంతో తొలుత 3 శాతం మేర ధరల పెంచాలని భావించామని.. కానీ.. రష్యా-ఉక్రెయిన్ ఆందోళనల నేపథ్యంలో ధరల పెంపును 8 నుంచి 9 శాతం మేర పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ తెలిపారు.