Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహి స్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తాము తమ పాల ధరలను పెంచినట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాల తరువాత ఈ పెంపుకు ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో పాటుగా ముడి సరుకుల ధరలు పెరగడం కారణం. పెంచిన ఈ ధరలతో ఆవు పాలు ధర 2 రూపాయలు పెరగ్గా, గేదె పాలు మూడు రూపాయలు, స్కిమ్డ్ పాలు మూడు రూపాయల ధర పెరిగింది. పెంచిన ఈ థరలతో 500మిల్లీ లీటర్ల ఆవు పాలు ఇప్పుడు 40 రూపాయలకు , గేదె పాలు 48 రూపాయలకు లభిస్తే , స్కిమ్డ్ పాలు 30 రూపాయలకు లభిస్తాయి.
సిద్స్ ఫార్మ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘గత రెండు సంవత్సరాలుగా ముడి పాల ధరలు 15%కు పైగా పెరిగాయి. ఇంధన ధరలు 45 % పెరిగాయి. ద్రవ్యోల్బణ ప్రభావంతో మేత, ప్రింటింగ్ ఇంక్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇవన్నీ కలిసి మొత్తంమ్మీద ఇన్‌ఫుట్ ధరలు పెంచాయి. దానితో తప్పనిసరై పాల ధరలు పెంచాల్సి వచ్చింది. నాణ్యతకు సిద్స్ ఫార్మ్ కట్టుబడి ఉంది. ఇటీవలి కాలంలో నాణ్యత నియంత్రణ కోసం సిద్స్ ఫార్మ్ గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. పెంచిన ఈ ధరలు మేము నాణ్యతను మరింతగా వృద్ధి చేసేందుకు సహాయపడతాయి’’ అని అన్నారు.