Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయంగా అభివృద్ధి చెంది, అంతర్జాతీయ వాణిజ్య సదస్సులలో అగ్రగామిగా వెలుగొందుతున్న, ముంబై కేంద్రంగా కన్స్యూమర్ లైఫ్‌స్టైల్ మరియు మొబైల్ యాక్ససరీల బ్రాండ్‌గా సేవలనందిస్తోన్న కెడీఎం ఇప్పుడు దక్షిణ భారతదేశ మార్కెట్లలో తమ స్ధానం విస్తరించుకోవడానికి ప్రణాళికలు చేసింది. ఈ బ్రాండ్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో విస్తరించడానికి లక్ష్యంగా చేసుకోవడంతో దక్షిణ భారతదేశపు వినియోగదారులు వీరి వినూత్న ఆఫరింగ్స్‌తో ప్రయోజనం పొందగలరు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 1లక్ష డీలర్ నెట్‌వర్క్‌కు చేరుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రతి ఇంటిలోనూ కెడీఎం ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోన్న కెడీఎం ఇప్పుడు చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలను సైతం చేరుకోవడం ద్వారా దక్షిణ భారతదేశంలో తమ స్ధానాన్ని బలోపేతం చేయాలనుకుంటుంది. కెడీఎం ఫౌండర్ ఎన్ డీ మలి మాట్లాడుతూ ‘‘ మొబైల్ యాక్ససరీస్ విభాగంలో దేశీయ బ్రాండ్‌గా మేము అత్యుత్తమ, సృజనాత్మక, వినూత్నమైన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా చేసుకున్నాము. ఓ దశాబ్ద కాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మా సంస్ధ ప్రధాన బలం దేశవ్యాప్తంగా ఉన్న 1000 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు, 25వేల డీలర్లు. మేము వారితో అతి సన్నిహితంగా పనిచేయడం ద్వారా వారి వ్యాపారాలతో పాటుగా మా వ్యాపారాన్ని కూడా వృద్ధి చేస్తున్నాము. దక్షిణ భారతదేశంలో తరువాత దశ వృద్ధి సాధించేందుకు పూర్తిగా సన్నద్ధమయ్యాం’’ అని అన్నారు. కెడీఎం కో –ఫౌండర్ భవర్లాల్ సుథర్ మాట్లాడుతూ ‘‘ సమ్మిళిత వృద్ధిని మేము విశ్వసిస్తున్నాము. గత దశాబ్ద కాలంలో కెడీఎం తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి వృద్ధి చెందుతుంది. నగదుకు తగ్గ విలువ అందించే నాణ్యమైన ఉత్పత్తులనందించడాన్ని మేము ఎప్పుడూ విశ్వసిస్తుంటాము. సహకార విధానం, వినియోగదారుల నమ్మకం కారణంగానే దేశవ్యాప్తంగా కెడీఎం విస్తరించగలిగింది’’ అని అన్నారు. కెడీఎం విస్తృతశ్రేణిలో ఉత్పత్తులను మొబైల్ యాక్ససరీలు–లైఫ్‌స్టైల్ విభాగంలో అభివృద్ది చేస్తుంది. వీటిలో మొబైల్ చార్జర్లు, ఇయర్‌ఫోన్స్, స్పీక ర్లు, నెక్‌బ్యాండ్స్ నుంచి హెడ్‌బ్యాండ్స్ వరకూ ఉన్నాయి.