Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిలీ : దేశంలోని ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా కొత్తగా అగ్రిటెక్ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం మ్యాన్‌కైండ్ అగ్రిటెక్ ప్రయివేటు లిమిటెడ్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మరియు గ్రామీణ రంగాన్ని మెరుగుపర్చనున్నట్టు తెలిపింది. తొలి రెండు, మూడేండ్లలో రూ.150 నుంచి 200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని మ్యాన్‌కైండ్ ఫార్మా ఎండి, ఛైర్మెన్ రాజీవ్ జునేజా వెల్లడించారు.