Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ వెల్లడి
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ముగింపు నాటికి ఏసీ మార్కెట్లో 14శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ తెలిపారు. మంగళవారం ఆయన వర్చూవల్గా 50 కొత్త ఏసీ మోడళ్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ 2022 మార్చి నాటికి తమకు 13.25 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో మార్చిలో తమ కంపెనీ 2-3 శాతం ధరలు పెంచిందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణీ పట్టణాల్లోనూ తమ వినియోగదారుల సంఖ్య పెరుగుతుందన్నారు. 2022 ద్వితీయార్థంలో శ్రీసిటీలోని తమ ప్లాంట్ అందుబాటులోకి రానుందన్నారు.