Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలోని వినియోగదారులకు 20,000 కన్నా ఎక్కువ పిన్కోడ్లలో విస్తృత శ్రేణి నాణ్యత అలాగే అందుబాటు ధరలో ఔషధాలు మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తులను అందించడం ద్వారా ‘స్వాస్థ్ భారత్’ లక్ష్యానికి తన వంతు తోడ్పాటు అందిస్తుంది.
అధీకృత ఔషధాలు మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తుల అందుబాటుకు ఉన్న అంతరాలను పరిష్కరించేందుకు దేశంలోని కుగ్రామాల్లోనూ లభించేలా చేయడం ద్వారా ఆరోగ్య సేవల వ్యవస్థ భాగస్వామ్యం మరియు సదృఢం చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది.
హైదరాబాద్ : భారతదేశంలో స్థానికంగా వృద్ధి చెందిన ఫ్లిప్‌కార్ట్ గ్రూపు డిజిటల్ ఆరోగ్య సేవల మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫారంపై ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ నేడు ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ యాప్‌ను విడుదల చేయగా ఇది దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు అధీకృత ఔషధాలు అలాగే ఆరోగ్య సేవల ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుంది. భారతదేశంలో 20,000 పిన్కోడ్లలోని వినియోగదారులకు సేవలను అందించే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ సులభమైన మరియు అనుకూలకరమైన నాణ్యత అలాగే అందుబాటు ధరలో ఔషధాలు మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తులను స్వతంత్ర విక్రేతల నుంచి ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ యాప్ ద్వారా అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సామర్థ్యం మరియు అనుభవంతో అలాగే విస్తృత స్థాయిలో చివరి వినియోగదారుని వరకు పంపిణీ సామర్థ్యాలను సస్తాసుందర్.కాం (Sastasundar.com)కు చెందిన సదృఢమైన ఆరోగ్య సేవల నెట్వర్కుతో కలిసి అందిస్తుంది. ఇది భారతదేశపు ఆరోగ్య సేవల ఎకోసిస్టమ్‌ను విస్తృత శ్రేణి ఔషధాలు మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తులు అలాగే సేవల ద్వారా బలోపేతం చేయడమే కాకుండా దీర్ఘావధి స్వస్థత మరియు సామాజిక అభివృద్ధికి సంబంధించిన ఆరోగ్య సేవల ఎకోసిస్టమ్‌తో భాగస్వామ్యాన్ని పొందుతుంది.
ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ యాప్ విడుదల గురించి ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ ఝవేరి మాట్లాడుతూ, ‘‘కొవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన రోజు నుంచి భారతీయులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే రోగ నిరోధక ఆరోగ్య సేవల్లో అపారమైన మార్పును కనుగొన్నారు. అదే విధంగా ఆరోగ్య సేవలు స్వస్థతకు గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రాధాన్యత పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ ద్వారా మేము అధీకృత ఔషధాలు మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తులు మరియు సేవలను దేశ వ్యాప్తంగా లభించేలా చేయడంలో ఉన్న ప్రముఖ అంతరాన్ని, అందులోనూ ఇప్పటికీ ఔషధాలను, ఇతర సేవలను అందుకునేందుకు సాధ్యం కాకుండా మారుమూల ఉన్న కుగ్రామాలకు అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికతను అలవర్చుకునే కోరికను కలిగి ఉన్నాము మరియు వినియోగదారులకు ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేసే మరియు అది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారికీ సేవలను అందిస్తూ, అందుబాటులో ఉండేలా చేసే మరియు ఆరోగ్యకరమైన భారతదేశానికి మా వంతు సేవలను అందించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము’’ అని తెలిపారు.
ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ యాప్‌ను వినియోగదారు స్నేహి ఇంటర్ఫేస్ ద్వారా డిజైన్ చేసి, అభివృద్ధి చేయగా, అది వినియోగదారునికి వారి సాంకేతికత ప్రావీణ్యత ఎలా ఉంటే ఇష్టమవుతుందో అలాగే ఉంటుంది. సదృఢమైన సాంకేతికత మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను కలిగిన ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ నియంత్రణ హద్దులకు అనుగుణంగా తీవ్రమైన అలాగే గంభీరమైన అనారోగ్యాలను వివిధ ఆరోగ్య పరిస్థితులకు ఔషధాలు మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తులు మరియు సేవలను భారతదేశానికి, అందులోనూ సంప్రదాయకంగా సేవలు అందించేందుకు సాధ్యం కాకుండా, మారుమూల ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులకూ అందిస్తుంది.
ప్రారంభంలో ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ ప్లాట్ఫారం 500+ రిజిస్ట్రరు ఫార్మసిస్ట్‌ల విక్రేతల నెట్వర్కు కలిగి ఉండగా వారు కచ్చితమైన ఔషధాల పంపిణీతో ఔషధ సలహాలను ధ్రువీకరిస్తారు. ఇది మధ్యవర్తి మార్కెట్‌ప్లేస్ ప్లాట్ఫారం అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ వివిధ రకాల నాణ్యత పరీక్షలు మరియు పరిశీలన నియమాలను కలిగి ఉండగా, అది అధీకృత ఔషధాలు మరియు స్వతంత్ర విక్రేతల నుంచి ఆరోగ్య సేవల ఉత్పత్తులను మాత్రమే వినియోగదారుని ఇంటి వాకిలి వద్ద అందిస్తుంది. రానున్న నెలల్లో ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ టెలికన్సల్టేషన్ మరియు ఇ-డయాగ్నోస్టిక్ వంటి సేవలను వినియోగదారులకు అందించే ఇతర విలువ ఆధారిత సేవలతో కలిపి థర్డ్ పార్టీ ఆరోగ్యసేవల పంపిణీదారులను తన నెట్వర్కులో కలుపుకోనుంది.
ఆరోగ్య సేవల ఆదాయాలు మరియు ఉద్యోగం రెండింటి దృష్టితో భారతీయ ఆర్థిక వ్యవస్థలో అత్యంత పెద్ద వలయంగా ఉంది. భారతదేశంలో డిజిటల్ విధానాలను అలవర్చుకోవడం వృద్ధి చెందుతున్నందున, దేశ వ్యాప్తంగా విస్తృత శ్రేణిలో ఔషధాలు మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తులు లభించేలా చేయడానికి ఒక అవకాశంగా మారింది.
ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో ఐఓఎస్‌లో కూడా లభించే ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ యాప్‌ను తక్కువ బ్యాండ్ విడ్త్లోనూ వినియోగించుకునేందుకు అవకాశం ఉండడంతో, దీన్ని దేశ వ్యాప్తంగా వినియోగదారులకు లభించేలా చేసింది.