Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వరం
మాతృత్వపు మధురిమలను పిల్లలులేని దంపతులు ఆస్వాదించే అద్భుత అవకాశం !
సికింద్రాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది సంతోషకరమైన రోగులతో పాటుగా భారతదేశం సహా 13దేశాలలో 3వేలకు పైగా క్లీనిక్స్ కలిగిన మెడికవర్ ఫెర్టిలిటీ ఇప్పుడు సికింద్రాబాద్‌కు వచ్చింది. తద్వారా సికింద్రాబాద్‌తో పాటుగా దగ్గరలోని ప్రాంతాలలో పిల్లలు లేని దంపతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను చూపనుంది.
మెడికవర్ ఫెర్టిలిటీ తమ క్లీనిక్‌ను సికింద్రాబాద్‌లో శ్రీ మన్మోహన్ శర్మ (మేనేజింగ్ డైరెక్టర్ , మెడికవర్ ఫెర్టిలిటీ), డాక్టర్ రునా ఆచార్య (సీనియర్ ఐవీఎఫ్ , కన్సల్టెంట్, మెడికవర్ ఫెర్టిలిటీ ), శ్రీ సందీప్ సోనీ (బిజినెస్ హెడ్ ఉ సౌత్ ) సమక్షంలో ప్రారంభించారు.
ఈ క్లినిక్ అన్ని రకాల కన్సల్టేషన్స్, పరీక్షలు, స్టిమ్యులేషన్స్ను సికింద్రాబాద్‌లోనే స్త్రీ, పురుషులకు అందిస్తుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఉద్ధేశించబడిన తల్లిదండ్రులు మెడికవర్ యొక్క ప్రపంచ శ్రేణి సాంకేతికత, అత్యున్నత శిక్షణ కలిగిన ప్రొఫెషనల్స్ మరియు ఐవీఎఫ్ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో పొందవచ్చు. మెడికవర్ ఫెర్టిలిటీ ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, చండీఘడ్, జమ్మూ మరియు శ్రీ నగర్లలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సంతానలేమికి సంబంధించి అవగాహన కల్పించడానికి సైతం మెడికవర్ ఫెర్టిలిటీ ప్రణాళిక చేస్తుంది.
మన్మోహన్ శర్మ (మేనేజింగ్ డైరెక్టర్, మెడికవర్ ఫెర్టిలిటీ) మాట్లాడుతూ 'భారతదేశంలో ప్రతి ఆరు జంటలలో ఒకటి తమ పునరుత్పత్తి వయసులో సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారు తగిన సమయానికి నిపుణులను సంప్రదిస్తే, వారు గర్భం దాల్చేందుకు ఉన్న అవకాశాలు మెరుగుపడతాయి` అని అన్నారు.
డాక్టర్ రునా ఆచార్య, సీనియర్ ఐవీఎఫ్ కన్సల్టెంట్ హైదరాబాద్ సైతం తన అభిప్రాయాలను వెల్లడించారు. 'సంతానలేమితో బాధపడుతున్న జంటలకు అనుకూలీకరించిన సంతానోత్పత్తి చికిత్సలను అందించే అవకాశం అందిస్తున్నామన్నారు. ఇది వారికి లబ్ధి కలిగిస్తుందని వెల్లడించారు. అదనంగా, రోగులు వాయిదా పద్ధతిలో 0% వడ్డీ రేటుతో ఫీజులు చెల్లించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. గత 26 సంవత్సరాలుగా, మెడికవర్ ఫెర్టిలిటీ ఎంతోమందికి మాతృత్వం పొందడంలో సహాయపడింది. ఈ అనుభవం మరియు నైపుణ్యం సంతానం పొందాలనుకునే తల్లిదండ్రులకు పెద్ద మార్పును తీసుకువస్తుంది.` అని అన్నారు.
మెడికవర్ ఫెర్టిలిటీ యొక్క సుశిక్షితులైన వైద్య సిబ్బంది, నాన్ఉమెడికల్ సిబ్బందితో పాటుగా అనుభవజ్ఞులైన క్లీనికల్ టెక్నీషియన్ల చేత తల్లిదండ్రులు లబ్ధి పొందుతారు. అదనంగా, నిష్ణాతులతో కూడిన డాక్టర్ల బృందం పలు రకాల వైద్య కేసుల నిర్వహణ మరియు సంతానలేమికి సంబంధించిన ప్రక్రియల నిర్వహణలో పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నారు.
మెడికవర్ ఫెర్టిలిటీకి నిరూపితమైన అత్యధిక విజయశాతం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మూడు గంటలకూ ఓ మెడికవర్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ శిశువు జన్మిస్తుంది.
మెడికవర్ ఫెర్టిలిటీ వెబ్సైట్ https://www.medicoverfertility.in/ సందర్శించండి. మెడికవర్ ఫెర్టిలిటీ యొక్క అత్యున్నత నైపుణ్యం మరియు అనుభవజ్ఞులైన నిపుణుల చేత కన్సల్టేషన్‌ను పొందండి.