Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ క్రికెట్ సీజన్లో స్నేహపు కొత్త భాష్ చీర్స్
హైదరాబాద్ : McDowell’s No 1 సోడా, డియాజియో ఇండియా ఫ్లాగ్షిప్ బ్రాండ్, ఈ క్రికెట్ సీజన్లో సెలబ్రేషన్స్ పార్టనర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అనుబంధాన్ని నేడు ప్రకటించింది. భారతదేశంతో క్రికెట్ స్నేహం ఒక మరుపురానిది. కొత్త, పాత స్నేహితులను ఒకచోట చేర్చే గొప్ప అనుబంధం ఇది! ఈ సంవత్సరం McDowell’s No1 సోడా, ఈ క్రికెట్ సీజన్లో మీ పట్టణంలో జరిగే వేడుకలను మరో మెట్టుపైకి తీసుకువెళ్లి అభిమాన జట్లను సరదాగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచేందుకు స్నేహితులందరినీ పిలుస్తోంది! దీన్ని ఎలా ముందుకు నడిపించాలి, ఎలా ఉల్లాసపరచాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల నుంచి ఒకరి వచ్చి చూపిస్తారు.
వేడుకలు బాధ్యతాయుతంగా జరుపుకోవడంలో McDowell’s No1 సోడా ఎప్పుడూ ముందుంటుంది, ‘స్నేహితులతో సరదాలు, కాని లిమిట్లో ఉండాలి సేలబ్రేషన్స్’ ప్రచారం ద్వారా తెలియజేస్తూ వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. స్నేహితులతో సురక్షితంగా వేడుకలు జరుపుకుంటూ, స్నేహితులందరూ సురక్షితంగా ఉండాలని కోరుకునే వినియోగదారులందరిలోనూ ఈ సందేశం ప్రతిధ్వనిస్తుంది.
క్రికెట్‌తో అనుబంధం గురించి డియాజియో ఇండియా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, పోర్ట్‌ఫోలియో హెడ్ రుచిరా జైట్లీ మాట్లాడుతూ, "క్రికెట్ ఒక క్రీడా మహోత్సవం. ఇది మొత్తం దేశాన్ని ఒక చోటికి చేర్చే స్ఫూర్తి ఇందులో ఉంది. ఇది భారతీయులకు పండుగ. సహజంగానే ఈ దిగ్గజ జట్లతో అనుబంధం కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. అంతే కాకుండా ఈ టోర్నమెంట్‌ని చూస్తున్నప్పుడు స్నేహితులతో కనెక్టై మ్యాజిక్ చేసే ప్రత్యేక క్షణాలు సజీవంగా తీసుకురావడానికి ఈ క్రికెట్ సీజన్ సరైన వేదిక. వినోదం, సరదా మరింత జోడించేందుకు మునుపెన్నడూ లేని విధంగా స్పూర్తిదాయకమైన, ఉల్లాసభరితమైన భాషతో అభిమానులను ఉత్సాహపరిచే అవకాశాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ అద్భుతమైన జట్లతో యారీ స్ఫూర్తిని పంచుకోవడం, అర్థవంతంగా కొత్త భాగస్వామ్యం నిర్మించుకోవడాన్ని McDowell’s No1 సోడా గర్వంగా భావిస్తోంది" అన్నారు.
చారిత్రాత్మకంగా చీర్స్ ఎప్పుడూ అభిమానులను ఒక్కటి చేసిన వారి అభిమానాన్ని మరింత వినోదాత్మకంగా చేస్తుంది. ఈ క్రికెట్ సీజన్లో వివిధ భాషలు, ప్రాంతాలలో వేడుకలు మరింత ఆస్వాదించేందుకు McDowell’s No1 వారితో మమేకం కానుంది.
భాగస్వామ్యం గురించి సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కె. షణ్ముగం మాట్లాడుతూ, "గత 10 సంవత్సరాలలో మా భారతీయ, అంతర్జాతీయ ఆటగాళ్ళ మధ్య చాలా బంధాలు ఏర్పడటం మేము చూశాం, అది ఈ ఆట ద్వారా అభిమానులకు మరింత వినోదాన్ని పంచుతుంది. ఈ ప్రత్యేకమైన స్నేహబంధం ద్వారా మేము టోర్నమెంట్‌ను గెలుచుకున్నాం. స్నేహితులు, స్నేహం ఏదైనా చేస్తుందనేందుకు ఇది నిదర్శనం. స్నేహబంధాలు కలిపే McDowell’s No 1 సోడా ఈ సంవత్సరం మా జట్టులో ఉంటూ ఈ సీజన్లో కొత్త బంధాలకు తెరతీస్తుంది" అన్నారు.
ఈ ప్రచారాన్ని DDB ముద్రకు చెందిన సృజనాత్మక బృందం రూపొందించింది. ఈ క్రియేటివ్ కాన్సెప్ట్ గురించి DDB ముద్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ పార్ట్నర్ అయిన సుజయ్ ఘోష్ మాట్లాడుతూ, “McDowell’s No1 ఎల్లప్పుడూ స్నేహం, కలిసిపోవడం (సేకరణ) కోసం నిలుస్తుంది. క్రికెట్ ఈ రెండింటినీ ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ క్రికెట్ సీజన్లో వేడుక చేసుకోవడానికి కొత్త మార్గాన్ని సృష్టించేందుకు మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. McDowell’s No 1 ద్వారా ఈ సంవత్సరం అభిమానులు, స్నేహితుల కొత్త భాషగా చీర్స్ నిలుస్తుంది” అన్నారు.
జట్ల అభిమానులు #No1YaariCheers హ్యాష్‌ట్యాగ్ అనుసరించవచ్చు. సీజన్లో తమ అభిమాన జట్టు కోసం తమ సరదా చీర్స్ పంచి అద్భుతమైన బహుమతులు గెలుచుకోవచ్చు.