Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్, విడిభాగాల తయారీ సంస్థ ఐటిపి ఏరో బుధవారం హైదరాబాదులో నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. నగరంలోని ఐడీఏ గాంధీనగర్‌లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, ఐటీపీ ఎక్స్‌టర్నల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జీసస్ కాటలీనా, ఐటీపీ ఎక్స్‌టర్నల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్, ఆ సంస్థ డెవలప్మెంట్ హెడ్ ఇనిగో సెపాస్ ఒడ్రియోజోలా సమక్షంలో ప్రారంభించారు. ఇక్కడ 160 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉన్నామని, రాబోయే మూడు సంవత్సరాలలో డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోందని కాటలీనా తెలిపారు.