Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి :బ్యాంకింగేతర విత్త సంస్థ యు గ్రో క్యాపిటల్ రూ.100 కోట్ల నిధులను సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్ వద్ద సెక్యూర్డ్ సీనియర్, ట్రాన్స్ఫరబల్, నాన్ కన్వర్టేబల్ డిబెంచర్లు (ఎన్సీడీ)లను జారీ చేయడానికి ప్రతిపాదనలు అందించినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. అనుమతులు రాగానే రూ.1000 నుంచి బాండ్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఈక్విటీ షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. సమీకరించిన నిధుల్లోంచి 75 శాతం రుణ చెల్లింపులకు, మరో 25 శాతం నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుననట్టు వెల్లడించింది.