Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిజిటల్ చెల్లింపుల విభాగంలోకి కొత్తగా 'క్విక్‌ఆన్' ప్రవేశించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ యాప్‌ను బుధవారం సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ఐటి డిపార్ట్మెంట్ చీఫ్ రిలేషన్స ఆఫీసర్ ఎ అమర్నాథ్ రెడ్డి, క్విక్‌ఆన్ డైరెక్టర్ పరందామ్ హాజరయ్యారు. క్విక్‌ఆన్ అనేది ఇంటర్నెట్ లేకుండా కూడా నిర్దిష్ట యుపిఐ లావాదేవీలను అనుమతించే తొలి మొబైల్ వాలెట్ అని పరందామ్ తెలిపారు. వీటిలో మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నగదు బదిలీ, యుపిఐ ఐడిని ఉపయోగించి చెల్లింపులు, ఏదైనా కోడ్‌ను స్కాన్ చేసి చెల్లించడం, వాలెట్ నుండి వాలెట్ బదిలీ, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ వంటివి సులభంగా చేసుకోవచ్చన్నారు. రాబోయే 3-6 నెలల్లో కోటి మంది వినియోగదారులకు సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.