Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: "స్మార్ట్ ఛాయిస్ ల్యాప్ టాప్స్ " స్టోర్ - ల్యాప్ టాప్ కోసం అన్వేషించే వారి కోసం షాపింగ్ అనుభవాన్ని సులభం చేసే లక్ష్యాన్ని కలిగిన ఒక విలక్షణమైన వేదికని అమేజాన్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. ఈ కొత్త కస్టమర్ చొరవతో, Amazon.in కస్టమర్స్ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేటప్పుడు ఒక అవగాహన, చైతన్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే లక్ష్యాన్ని కలిగి ఉంది.
కొనుగోలు చేసే సమయంలో ఎన్నో ఆప్షన్స్ లభిస్తుండటం, పరిశీలించాల్సిన అవసరమున్న విభిన్నమైన ఫీచర్స్ తో ల్యాప్ టాప్ కొనుగోలు చేయడం కస్టమర్స్ కి ఒక కష్టంగా నిర్ణయంగా మారింది. ఈ ప్రక్రియ విసుగు కలిగిస్తుంది, సమయం కూడా ఎక్కువగా తీసుకుంటుంది, చాలామందికి ఇది ఒత్తిడి కూడా కలిగిస్తుంది. కస్టమర్ ఈ విషయంలో వెనకడుగు వేయడం గమనించి, అమేజాన్ ఇండియా ఈ ప్రయాణాన్ని సులభం చేసింది, ల్యాప్ టాప్ కొనుగోలు చేసే ప్రయాణాన్ని సులభంగా, ఒత్తిడిరహితంగా చేసింది.
కొత్త చొరవ క్రింద, ప్రాథమికమైన ల్యాప్ టాప్, పాఠశాల కోసం ల్యాప్ టాప్స్, ఆఫీస్ లో ఉపయోగించడానికి ల్యాప్ టాప్స్, వివిధ పనులు చేయడానికి/కాలేజీ కోసం ఉపయోగించడానికి ల్యాప్ టాప్స్, కోడింగ్ కోసం ల్యాప్ టాప్స్, ఆరంభ స్థాయి గేమింగ్ ల్యాప్ టాప్స్ మరియు అత్యధికంగా సామర్థ్యాన్ని చూపించే గేమింగ్ ల్యాప్ టాప్ వంటి వివిధ ప్రమాణాలు ఆధారంగా ల్యాప్ టాప్స్ సౌకర్యవంతంగా వర్గీకరించబడ్డాయి. సంబంధిత బ్రాండ్స్ మరియు టెక్నాలజీ భాగస్వామి గుర్తించడం ద్వారా ఎంపిక ఆధారపడింది, అందువలన సూచనలకు మరింత విశ్వశనీయతని కలిగించింది. కస్టమర్స్ తమ వాడకం పద్ధతిని గుర్తించవచ్చు మరియు సంబంధిత ఎంపిక ద్వారా బ్రౌజ్ చేయవచ్చు. అంద సులభం!
"కస్టమర్ కొనుగోలు ప్రయాణాన్ని సరళం చేయడంలో అమేజాన్ లో మేము నిమగ్నమయ్యాం. 'స్మార్ట్ ఛాయిస్ ల్యాప్ టాప్స్' స్టోర్ ఆరంభంతో, కొనుగోలు ప్రక్రియని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము మరియు కస్టమర్స్ అవగాహనతో కూడిన నిర్ణయాలు చేయడంలో సహాయం చేస్తాం. వాడకం-కేసెస్ లో తమ ఎంపికని ఉత్తమంగా తీసుకువచ్చే అన్ని ప్రముఖ ల్యాప్ టాప్స్ బ్రాండ్స్ తో మేము భాగస్వామం చెందాము" అని అక్షయ్ అహూజా, డైరక్టర్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అమేజాన్ ఇండియా అన్నారు. కస్టమర్స్ కూడా ఆకర్షణీయమైన బైబ్యాక్ ఆప్షన్స్; తమ ప్రాధాన్యతనిచ్చే ల్యాప్ టాప్ కొనుగోలు పై నో -కాస్ట్ ఈఎం ఆఫర్స్ మరియు బ్యాంక్ డిస్కౌంట్స్ పొందవచ్చు.
ద స్మార్ట్ ఛాయిస్ ల్యాప్ టాప్స్ స్టోర్ ఫ్రంట్ ని www.amazon.in/smartchoice పై చూడవచ్చు.