Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాలు కఠినంగా ఉంటాయనే అంచనాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగుతున్నారు. దేశంలో అధిక ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించనున్న ద్వైమాసిక పాలసీ నిర్ణయాల నేపథ్యంలో అచితూచి వ్యవహారిస్తున్నారు. గురువారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 575 పాయింట్లు లేదా 0.97 శాతం క్షీణించి 59,035కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 17,640 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6 శాతం చొప్పున నష్టపోయాయి.