Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇ-కామర్స్ కోసం టాటానియు ఆవిష్కరణ
న్యూఢిల్లీ : అన్ని ఇ-కామర్స్ లావాదేవీలకు ఒకే యాప్ ఉండాలనే ఉద్దేశ్యంతో టాటా గ్రూపు సరికొత్తగా ఓ సూపర్ యాప్‌ను రూపొందించింది. అమెజాన్, జియోలకు పోటీగా గురువారం 'టాటా నీయు' పేరుతో ఈ యాప్‌ను ఆవిష్కరించింది. దీంతో విమానయాన సంస్థలు, హోటళ్లు, ఔషదాలు, కిరాణా సామాగ్రిని తదితర అన్నీ సర్వీసులు ఒకే వేదికపై వినియోగించుకోవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. నీయు యాప్‌లో బిగ్ బాస్కెట్, 1ఎంజీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎయిర్ ఆసియా, క్రోమా, ఐహెచ్‌సీఎల్, క్యూమిన్, స్టార్‌బక్స్, టాటా క్లిక్, టాటా ప్లే తదితర వాటి సేవలను ఇందులో పొందుపర్చింది. ఈ సమీకృత యాప్ అన్ని కలిపి ప్రారంభంలోనే 12 కోట్ల ఖాతాదారులను కలిగి ఉందని టాటా గ్రూపు ఛైర్మన్ చంద్ర శేఖరన్ తెలిపారు. 2.500 ఆఫ్‌లైన్ స్టోర్లు నమోదై ఉన్నాయన్నారు. వ్యక్తిగత రుణాలు, ఇన్స్యూరెన్స్ పాలసీలను కూడా అందిస్తుందని పేర్కొంది. నియోను ఆవిష్కరించిన కొన్ని గంటల్లోనే 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.