Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ తర్వాత కూడా వినియోగదారుల విశ్వాసం స్తబ్దుగానే ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామి (సీఎంఐఈ) పేర్కొంది. 'దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అంతంతగానే ఉంది. ఈ ప్రభావం వినియోగదారుల విశ్వాసంపై పడుతుంది. కరోనా తొలి వేవ్ తర్వాత సగటున వినియోగదారుల విశ్వాసం 3.1 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ తర్వాత ఇది మరింత పడిపోయి 2.6 శాతంగా నమోదయ్యింది. 2022 మార్చిలో 3.7 శాతంగా నమోదు కాగా.. ఇంతక్రితం ఫిబ్రవరిలో 5 శాతంగా, జనవరిలో 4 శాతంగా చోటు చేసుకుంది' అని సిఎంఐఈ పేర్కొంది. 2023 వరకు సగటున ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేసింది. వినియోగదారుల విశ్వాసం పూర్తి స్థాయిలో పుంజుకోవడానికి మూడేండ్ల కాలం పట్టొచ్చని విశ్లేషించింది.