Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వెస్ట్ లైఫ్ డెవలప్ మెట్ లిమిటెడ్ చే సొంతమై, నిర్వహించబడుతున్న మెక్ డొనా ల్డ్స్ ఇండియా వెస్ట్ అండ్ సౌత్ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, తన రెస్టారెంట్లలో అందించే ఆహారం మంచిదనాన్నిమెరుగుపరిచేందుకు తనకు గల కట్టుబాటును పునరుద్ఘాటించింది. పరిశ్రమలో ఎన్నో వినూ త్నతలను ప్రవేశపెట్టిన అగ్రగామిగా ఉన్న మెక్ డొనాల్డ్స్, భారతదేశంలో ఎంపిక చేసిన ఆహార పదార్థాల నుంచి కృత్రిమ రంగులు, కృత్రిమ నిల్వకారకాలు, కృత్రిమ ఫ్లేవరింగ్ ను తొలగించిన మొదటి క్యూఎస్ఆర్ బ్రాండ్ గా కూడా నిలిచింది. అంతేగాకుండా మెక్ డొనాల్డ్స్ ఇప్పుడు స్టోర్ లో, యాప్ పై యావత్ మెనూకు సంబంధించి, అలర్జీలు, పోషక సంబంధిత సమాచారాన్ని కూడా అందించనుంది. వినియోగదారులు తమకు మేలు చేసే ఆహారపదార్థాలను ఎంపిక చేసుకునేందుకు ఇది వారికి వీలు కల్పిస్తుంది. అవగాహనతో కూడిన ఆహార ఎంపికలను చేసుకోవడంలో తోడ్పడేందుకు గాను పోషక సమాచారంపై వారికి సులభమైన యాక్సెస్ ఉండడాన్ని మెక్ డొనాల్డ్స్ విశ్వసిస్తోంది. నేడు వినియోగదారులు తమ ఆహారం ఏమి కలిగి ఉంటుందనే విషయంతో పాటుగా అందులో ఏమి లేదు అనే అంశంపై కూడా అవగాహన కలిగి ఉంటు న్నారు. అందుకే, ఈ బ్రాండ్ పై వినియోగదారులు ఉంచిన విశ్వాసాన్ని మరింత పెంచుకునే రీతిలో మెక్ డొనా ల్డ్స్ తన ప్రగతిశీలక ఉద్యమం క్లీన్ లేబుల్స్ ను చాటిచెబుతూ తన ఆహారంలో ఉండే పదార్థాలపై మరింత అవ గాహనను ఏర్పరుస్తోంది.
మెక్ స్పైసీ ఫ్రైడ్ చికెన్, చికెన్ నుగెట్స్, వెజ్ నుగెట్స్, చికెన్ స్ట్రిప్స్, హాష్ బ్రౌన్స్, హాట్ కేక్స్ వంటి ఉత్పత్తులు ఇప్పుడు యాడెడ్ కలర్స్, ఫ్లేవర్స్ లేదా నిల్వకారకాలకు కలిగిఉండవు. ఐకానిక్ మెక్ డొనాల్డ్స్ ఫ్రైస్, అన్ని పాటీస్ కూడా ఎలాంటి కృత్రిమ నిల్వకారకాలు, రంగులు లేదా ఫ్లేవర్లు లేకుండా ఉంటాయి. ఈ బ్రాండ్ తన ‘రి యల్ ఫుడ్, రియల్ గుడ్’ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఇది మెక్ డొనాల్డ్స్ లో అందించే ఆహారం మంచి ద నాన్ని చాటి చెబుతుంది. తన రెస్టారెంట్లలో అందించే ఆహారంపై, ఆయా ఉత్పాదనల్లో ఉపయోగించే దినుసు లపై పారదర్శకంగా ఉండేందుకే మెక్ డొనాల్డ్స్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. తద్వారా సరైన ఎంపికల ను చేసుకునేందుకు వినియోగదారులు సాధికారికతను కలిగిఉంటారు. ఇది సంప్రదాయక రీతుల్లో మరియు సోషల్ మీడియా ద్వారా ఎల్లవేళలా కొనసాగుతూ ఉండే క్యాంపెయిన్ గా ఉంటంది. తన ఆహారం గురించి ఈ బ్రాండ్ ఏ విధంగా పని చేస్తుందనే విషయం గురించి వినియోగదారులు అవగాహన పొందగలుగుతారు. ఆహార ఎంపికల గురించి పారదర్శకంగా ఉండేందుకే మెక్ డొనాల్డ్స్ ఎల్ల వేళలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ డైరెక్టర్ స్మితా జాటియా మాట్లాడుతూ ‘‘ఆహారం కూడా సాంకేతికత వంటిది, అది సమయంతో పాటుగా మారుతూ ఉంటుంది’’ అని అన్నారు. ‘‘మెక్ డొనాల్డ్స్ లో మేం మా బ్రాండ్ ను ఎంచుకున్నందుకు గాను వినియోగదారులు ఆనందించగలిగేలా అత్యున్నత నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందిస్తాం. మా ఆహారం పోషక విలువలను మెరుగుపరిచేందుకు నిరంతరంగా మేం ప్రయ త్నిస్తున్నాం. వినియోగదారులకు తమ బర్గర్లకు సంబంధించి పోషక ఎంపికను అందించేందుకు గాను కొన్నేళ్ల క్రితం మేం మా అన్ని రెస్టారెంట్లలోనూ హోల్ వీట్ బన్స్ ను ప్రవేశపెట్టాం. అదే విధంగా మా ఆహారం పోషక ప్రొ ఫైల్ ను మెరుగుపరిచేందుకు గాను మా ఉత్పాదనల్లో చాలావాటిని రీఇంజినీర్ చేశాం. మేం ముందుకు వెళ్తు న్న కొద్దీ, ఎంచుకునేందుకు మరెన్నో ఆప్షన్లను అందించేలా మా మెనూకు మరిన్ని ఉత్పాదనలను జోడించేం దుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు. మెనూ వినూత్నత విషయానికి వస్తే, ఎల్లప్పుడూ పరిశ్రమలో లీడర్ గా మెక్ డొనాల్డ్స్ ఉంటూనే ఉంది. వెస్ట్ లైఫ్ ఈ గ్లోబల్ బ్రాండ్ ను భారతదేశానికి తెచ్చింది మొదలుకొని కంపెనీ సంపూర్ణ పారదర్శకత ఉండేలా దిను సులను అవి వచ్చిన క్షేత్రాల దాకా ట్రేస్ చేయగలిగేలా క్లోజ్డ్ లూప్ సప్లయ్ చెయిన్ ను ఏర్పాటు చేసుకోవ డంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. తన రెస్టారెంట్లలో రియల్ గుడ్ ఫుడ్ ను అందించేందుకు మెక్ డొనాల్డ్స్ కట్టుబడి ఉంది. ఈ దిశలో గతంలో తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనం. తాను అందించే ఆహారం సాధ్యమై నంత వరకు హోల్ సమ్ గా, పోషకయుక్తంగా ఉండాలనే ప్రయాణాన్ని కొన్నేళ్ల క్రితం మెక్ డొనాల్డ్స్ ఆరంభిం చింది. ఈ విషయంలో క్యూఎస్ఆర్ పరిశ్రమలో చాంపియన్ గా నిలిచే ప్రయత్నాలను అది కొనసాగించనుంది.
మీరు వినియోగించేందుకు ఇష్టపడని ఎలాంటి అడిటివ్స్ లేకుండానే
ఇప్పుడు మీరు మీకు నచ్చిన దాన్ని మెక్ డొనాల్డ్స్ లో ఆనందించవచ్చు
ఎంపిక చేసిన మెక్ డొనాల్డ్స్ ఉత్పాదనలు కృత్తిమ నిల్వకారకాలు, రంగులు, ఫ్లేవర్స్ లేకుండా ఉంటాయి
వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ గురించి:
వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ (బీఎస్ఈ: 505533)(డబ్ల్యూడీఎల్) తన అనుబంధ సంస్థ హార్డ్ క్యాజిల్ రెస్టారెంట్స్ ప్రై.లి. (హెచ్ఆర్ పిఎల్) ద్వారా భారతదేశంలో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల (క్యూఎస్ఆర్)ను నెలకొల్పుతూ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ల చెయిన్ ను నిర్వహిస్తోంది. మెక్ డొనాల్డ్స్ భారతీయ అనుబంధ సంస్థ ద్వారా మెక్ డొనాల్డ్స్ కార్పొరేషన్ యూఎస్ఏ తో ఫ్రాంచైజీ అనుబంధం కలిగిఉంది.
హార్డ్ క్యాజిల్ రెస్టారెంట్ల గురించి:
హెచ్ఆర్ పిఎల్ అనేది భారతదేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లు సొంతంగా నెలకొల్పేందుకు, నిర్వ హించేందుకు హక్కులు కలిగి ఉన్న మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ. 1996లో స్థాపితమైన నాటి నుంచి ఈ ప్రాంతంలో ఫ్రాం చైజీగా ఉంది.
హెచ్ఆర్ పిఎల్ ఏటా 200 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తోంది. తెలంగాణ, గుజరాత్, కర్నాటక, మహా రాష్ట్ర, తమిళనాడు, కేరళ, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంత మైన పుదుచ్చేరిలోని 42 నగరాల్లో ఇది 316 (2021 డిసెంబరు 31నాటికి) రెస్టారెంట్లను కలిగిఉంది. 10,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. మెక్ డొనాల్డ్స్ వివిధ ఫార్మాట్స్, బ్రాండ్ ఎక్స్ టెన్షన్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్టాండ్ అలోన్ రెస్టారెంట్లు, డ్రైవ్ – త్రూస్, 24/7, మెక్ డెలివరీ, మెక్ బ్రేక్ ఫాస్ట్, డెజర్ట్ కియోస్క్ లు లాంటివి వీటిలో ఉన్నాయి. బర్గర్లు, ఫింగర్ ఫుడ్స్, రాప్స్, రైస్, సలాడ్స్, హాట్ అండ్ కోల్డ్ బీవరేజెస్ లతో పా టుగా విస్తృత శ్రేణి డెజర్ట్స్ దీని మెనూలో ఉన్నాయి. పలు మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లు ఇన్ హౌస్ మెక్ కెఫె ను క లిగి ఉంటాయి.
హెచ్ఆర్ పిఎల్ నిర్వహించే ప్రతీ రెస్టారెంట్ – నాణ్యం, సేవ, పరిశుభ్రత, విలువ- అనే మెక్ డొనాల్డ్స్ వ్యవస్థ మూల స్తంభాలను కలిగి ఉంటుంది.