Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వృద్ధి చెందుతున్న చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంబీలు) కోసం భారతదేశపు సుప్రసిద్ధ నియోబ్యాంక్, ఫ్లోబిజ్ తమ నూతన బ్రాండ్ ప్రచారం ‘బిజినెస్ కా అచ్చా టైమ్ షురు’ను నాలుగు ప్రకటన చిత్రాలతో ప్రారంభించింది. నూతనంగా ప్రారంభించిన ఈ బ్రాండింగ్ ప్రచారం ఫ్లో బిజ్ యొక్క ప్రతిష్టాత్మక ఉత్పత్తి మైబిల్ బుక్ యొక్క అత్యాధునిక బిల్లింగ్ సామర్థ్యం, సమర్థతలను వెల్లడిస్తుంది. అగ్రగామి జీఎస్టీ ఇన్వాయిసింగ, ఎక్కౌంటింగ్ సాఫ్ట్వేర్ మై బిల్ బుక్. ఈ ప్రచారం ద్వారా చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు తమ రోజువారీ వ్యాపార కార్యకలాపాలలో ఎదుర్కొంటున్న పలు సవాళ్లు , వాటి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వెల్లడించింది. ఈ ప్రచారం ఓఓహెచ్, ఓటీటీ, సోషల్ మీడియా, మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్లు సహా పలు మాధ్యమాల వ్యాప్తంగా ఇవి ప్రసారమవుతున్నాయి. దీనితో పాటుగా భారీ స్ధాయిలో ఆఫ్‌లైన్ బ్రాండింగ్ సైతం జరుగనుంది. ఇది దేశవ్యాప్తంగా మ్యాక్రో మార్కెట్ల వ్యాప్తంగా సుదీర్ఘకాల దృశ్యమాన్యతను సృష్టించనుంది. ఈ ప్రచార నేపథ్యంను మైబిల్బుక్ తో పనితీరు మెరుగుపరచడం మరియు వృద్ధికి సాధికారితను కల్పించడం ద్వారా వ్యాపారాలకు మంచి సమయాన్ని తీసుకురావడం అనే నేపథ్యంతో తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రచార చిత్రాలను వ్యూహాత్మకంగా మైబిల్బుక్ను ఏకీకృత పరిష్కారమన్నట్లుగా తెలుపడం లక్ష్యంగా చేసుకుంది. ఇది వ్యాపార సంస్థలు జీఎస్టీ అనుగుణ ఇన్వాయిస్లు సృష్టించడం, ఇన్వెంటరీ నిర్వహణ, రిసీవబల్స్ మరియు పేయబల్స్ నిర్వహించడం, అత్యాధునిక నివేదికల ద్వారా వ్యాపార సంస్థల పనితీరు గమనించడం చేయనుంది. ఇటీవలనే జోడించిన ఫీచర్ ‘స్మార్ట్ కలెక్ట్’ సైతం యుపీఐ మరియు బ్యాంక్ బదిలీ లావాదేవీలకు మద్దతునందించడంతో పాటుగా వినియోగదారుల నుంచి చెల్లింపులను సేకరించడం, వాటిని పెండింగ్ఇన్వాయిస్లకు ఆటోమేటిక్‌గా రీకన్సిల్ చేయడం చేస్తుంది. ఈ ప్రీమియం ఉత్పత్తి ఫీచర్లను ప్రదర్శిస్తూ, ఈ ప్రచారం ఎక్కడ నుంచైనా, ఎప్పుడైనా వ్యాపార నిర్వహణ అత్యంత సులభమని నలుగురు వ్యాపారవేత్తల కథనాల ద్వారా తెలుపుతున్నారు. అందులో మొదటిది ః తన భవిష్యత్‌పై అత్యుత్తమ నియంత్రణ కలిగిన వ్యక్తి (1 – భవిష్యవాణి) ; పని–జీవితం నడుమ సమతుల్యత పాటించడం (2 –ఫ్యామిలీ సమయం) ; అల్లాద్దీన్ యొక్క దీపం తో అదృష్టం పట్టుకోవడం – మై బిల్ బుక్ కోసం మెటాఫోర్ (3–అల్లాద్దీన్ కా చిరాగ్) ; మరియు పలు ఉత్పత్తి ఫీచర్లపై ఆధారపడి అత్యుత్తమ మల్టీ టాస్కర్గా మారడం (4 – మల్టీటాస్కర్) ఫ్లోబిజ్ బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ పుల్కిత్ సాబూ మాట్లాడుతూ ‘‘ మా వినియోగదారుల సమీక్షలకు ప్రతిబింబాలు ఈ కథనాలు. అతి సులభంగా వినియోగించతగిన, శక్తివంతమైన మరియు అందుబాటులోని పరిష్కారాలను ఎస్ఎంబీల యొక్క రోజువారీ వ్యాపార సమస్యలకు అందించడం ద్వారా ఓ వైవిధ్యతను తీసుకురావడాన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాము. మా వినియోగదారుల సంఖ్యలాగానే, ఈ చిత్రం విస్తృత శ్రేణిలో వ్యాపారవేత్తలు అంటే యువ వ్యాపారవేత్తలు మొదలు పేరొందిన వ్యాపార యజమానుల వరకూ చూపుతుంది. వీరంతా కూడా మై బిల్బుక్ను పూర్తి నమ్మకంతో సౌకర్యవంతంగా వినియోగిస్తున్నారు, నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశిస్తున్న వేళ ఈ ప్రచారం ప్రారంభమైంది. మీ భవిష్యత్‌కు అత్యుత్తమ సమయం అందిస్తుందనే వాగ్ధానం ఇది అందిస్తుంది. ఓఓహెచ్ అడ్వర్టయిజింగ్ మరియు బీటీఎల్ కార్యకలాపాల ద్వారా అత్యధిక ఆఫ్‌లైన్ విజిబిలిటీతో పాటుగా దేశవ్యాప్తంగా డిజిటల్ గా కూడా ప్రచారం చేయబోతున్నాం’’ అని అన్నారు.
రాహుల్ రాజ్, ఫౌండర్ అండ్ సీఈవొ, ఫ్లోబిజ్ మాట్లాడుతూ ‘‘ ఈ నూతన బ్రాండ్ ప్రచారం మా గత ప్రచారం ‘బిజినెస్ కో లే సీరియస్లీ’ను అనుసరిస్తుంది. దానిని మా బ్రాండ్ ప్రచారకర్త మనోజ్‌బాజ్‌పాయ్‌తో తీర్చిదిద్దాము. ఇటీవలనే ప్రకటించిన యాడ్ సిరీస్, దీని సరళత, సాన్స్–హైపర్బోల్, సాన్స్ జార్గాన్ టేనర్లో చిరు వ్యాపారాల కోసం రోజువారీ వ్యాపార కార్యకలాపాల సవాళ్ల పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించడంతో పాటుగా తమకు ఎంతో విలువైన అంశాలు అంటే కుటుంబ, వ్యాపార వ్యూహరచన కోసం సమయం కేటాయించేందుకు సైతం కేటాయించేందుకు అందిస్తుందని వెల్లడిస్తుంది’’ అని అన్నారు.