Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రీమియం ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీ పివిఆర్ సినిమాస్ హైదరాబాద్లో కొత్తగా ఐదు స్క్రీన్ల ప్రాపర్టీను ప్రారంభించినట్లు ప్రకటించింది. దక్షిణాదిలో 49 ప్రాపర్టీలలో 301 స్క్రీన్లతో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకున్నట్లయ్యిందని తెలిపింది. తాజాగా గచ్చిబౌలి ఏట్రియం మాల్లో అందుబాటులోకి తెచ్చిన ప్రాపర్టీతో నగరంలో 11 ప్రాపర్టీలతో 62 స్క్రీన్లకు పెంచుకున్నట్లయ్యిందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలు కొనసాగుతాయని ఆ సంస్థ పేర్కొంది.