Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ4లో రికార్డ్ ఆదాయం
- రూ.9,926 కోట్ల నికర లాభాలు
- ఏడాదిలో లక్ష ఉద్యోగాలు..
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నలాజీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఏకంగా రూ.50,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది తమ చరిత్రలోనే కీలక మైలురాయి అని ఆ కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో టీసీఎస్ నికర లాభాలు రూ.10వేల కోట్ల చేరువలో రూ.9,926 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాలపై టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపినాథన్ స్పందిస్తూ తమ ఖాతాదారుల్లో మెరుగైన వృద్థి చోటు చేసుకుందన్నారు. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా ఆర్డర్ బుక్ మరింత పటిష్టం అయ్యిందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,03,546 ఉద్యోగులను తీసుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఒక్క క్యూ4లోనే 35,209కి మందికి అవకాశం కల్పించినట్లు పేర్కొంది. భారత్లో తమ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195కి చేరినట్లు వెల్లడించింది. క్రితం క్యూ4లో 187 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 704 పేటెంట్లకు దరఖాస్తు చేయగా.. 437కు అనుమతులు లభించాయని పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తంగా 6,583 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసినట్లయ్యిందని వెల్లడించింది.