Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 26వ తేదీని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ డే గా నిర్వహిస్తున్నారు. దీనిద్వారా సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ డే పురస్కరించకుని రిజల్యూట్ 4ఐపీ చేత శక్తివంతమైన ఐపీ బడ్డీ ఓ వ్యాసరచన పోటీని టీఎస్ఐఐసీ భాగస్వామ్యంతో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్స్కూల్ మరియు లెక్సార్బిస్ వద్ద నిర్వహించనుంది. ఈ వ్యాసరచన పోటీలను ‘ఐపీ మరియు యువత అత్యుత్తమ భవిష్యత్ కోసం ఆవిష్కరణలు’ అనే అంశం ఆధారంగా 2022 విపో నేపథ్య అనుగుణంగా నిర్వహించనున్నారు. ఈ పోటీకి సంబంధించిన వివరాలను ipbuddy@resolutegroup.in వద్ద లేదా 8341110413కు వాట్సాప్ చేయడం ద్వారా పొందవచ్చు.
ఎల్సీజీసీ రిజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెందిన ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ సేవల విభాగం రిజల్యూట్4ఐపీ. హైదరాబాద్లో ఐపీ శావీ సంస్కృతిని అందించడం రిజల్యూట్ 4ఐపీ లక్ష్యం. తద్వారా తెలంగాణాను ఐపీ ఫైలింగ్స్ పరంగా దేశంలో అగ్రగామి మూడు రాష్ట్రాలలో ఒకటిగా నిలుపడమే లక్ష్యంగా కృషి చేస్తుంది.