Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదారు కియా ఇండియా, నేడు తమ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రోడక్ట్స్ కియా సెల్టోస్ మరియు కియా సోనెట్ యొక్క రెండు నవీకరించబడిన వెర్షన్స్ ని ప్రకటించింది. ఈ నవీకరించబడిన వెర్షన్స్ ఇప్పుడు బహుళ అప్ డేట్స్ మరియు అదనపు ఫీచర్స్ తో వచ్చాయి. ఇవి ఈ రెండు ప్రోడక్ట్స్ యొక్క విలువని మరింత మెరుగుపరుస్తాయి. అదనంగా, ఎగువ వేరియెంట్స్ నుండి ఇప్పటికే ఉన్న ఎన్నో ఫీచర్స్ ఇప్పుడు దిగువ వేరియెంట్స్ కి విస్తరించబడ్డాయి. భద్రత పై మెరుగ్గా దృష్టి కేంద్రీకరించి, కియా ఇండియా ఇప్పుడు సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ని నవీకరించబడిన సెల్టోస్ మరియు నవీకరించబడిన సోనెట్ కి చేర్చడం ద్వారా 4 ఎయిర్ బ్యాగ్స్ ని అన్ని దిగువ వేరియెంట్స్ లో ప్రామాణికం చేసింది. రెండు కొత్త రంగులు "ఇంపీరియల్ బ్లూ" మరియు "స్పార్క్లింగ్ సిల్వర్ " ని కూడా ఈ నవీకరించబడిన కియా సెల్టోస్ మరియు కియా సానెట్ వెర్షన్స్ పై పరిచయం చేస్తున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. తమ కస్టమర్స్ కి ఆధునిక కనెక్టివిటీని అందించడానికి పూర్తిగా నవీకరించబడిన కియా కనక్ట్ యాప్ తో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ భారతదేశంలో మొదటిసారిగాడీజిల్ ఇంజన్ తో జత చేయబడినఇంటిలిజెంట్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐఎంటీ) టెక్నాలజీని కూడా నవీకరించబడిన కియా సెల్టోస్ లో పరిచయం చేసింది.
కియా ఇండియా నవీకరించబడిన సెల్టోస్ మరియు సోనెట్ లని వరుసగా ప్రారంభపు ధర ఐఎన్ఆర్ 10.19లక్షలకు (ఎక్స్-షోరూం, భారతదేశంవ్యాప్తంగా) మరియు ఐఎన్ఆర్ 7.15లక్షలు (ఎక్స్-షోరూం, భారతదేశం వ్యాప్తంగా) విడుదల చేసింది.
మ్యూంగ్-సిక్ సోహన్, ప్రధాన సేల్స్ అధికారి, కియా ఇండియా ఇలా అన్నారు, "పోటీయుత భారతదేశపు ఆటో మార్కెట్ లో మేము మా సానుకూలమైన వేగాన్ని కొనసాగించడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. మా విలువైన కస్టమర్స్ మా ఉత్పత్తులలో నిరంతర నమ్మకాన్ని కలిగి ఉండటం మా 'కస్టమర్ కి ప్రాధాన్యత ' ఇచ్చే ప్రోడక్ట్ వ్యూహానికి నిరూపణ, ఇదే అతి తక్కువ సమయంలోనే మేము అసంఖ్యాకమైన మైలురాళ్లు సాధించేలా మమ్మల్ని ప్రోత్సహించింది. వాహనంలో ఉన్న వ్యక్తులు పై మేము దృష్టి కేంద్రీకరించడం అనేది అన్ని దిగువ వేరియెంట్స్ లో 4 ఎయిర్ బ్యాగ్స్ ప్రామాణికంతో నవీకరించబడిన సెల్టోస్ మరియు సోనెట్ లలో కనిపిస్తుంది. అదనంగా, తమ సంబంధిత విభాగాలలో కొత్త ప్రామాణాల్ని పునః సృష్టించడానికి వివిధ సౌకర్యాలు, స్టైలింగ్ మార్పులు కూడా చేర్చబడ్డాయి. ఇప్పటి వరకు, మేము దాదాపుగా 2.67 లక్షల సెల్టోస్ యూనిట్స్ విక్రయించాము మరియు భారతదేశపు మార్కెట్ లో 1.25 లక్షల సోనెట్ యూనిట్స్ ని విక్రయించాము. నవీకరించబడిన సెల్టోస్ మరియు సోనెట్ లు భారతదేశంలో మా ప్రయాణం ఆరంభమైన నాటి నుండి మా మీద మా కస్టమర్స్ చూపించిన అదే ఉత్సుకత మరియు నిబద్ధతలతో స్వాగతం పలుకుతాయి".
నవీకరించబడిన సెల్టోస్
నవీకరించబడిన కియా సెల్టోస్ 13 కొత్త మెరుగుదలలతో అభివృద్ధి చేయబడ్డాయి. కంపెనీ కియా సెల్టోస్ హెచ్ టీకే+ వేరియెంట్ పై 1.5 డీజిల్ ఇంజన్ తో భారతదేశంలో మొదటిసారిగా కంపెనీ ఇంటిలిజెంట్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐఎంటీ) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. డీజిల్ 1.5 పవర్ ట్రైన్ మద్దతుతో కొత్త వేరియెంట్ హెచ్ టీఎక్స్ ఏటీలో లభిస్తోంది.
కియా ఇండియా స్పోర్టియర్ మరియు మరింత ప్రతిస్పందించే డ్రైవింగ్ అనుభవం కోసం నవీకరించబడిన కియాసెల్టోస్ యొక్క అన్ని ఆటోమేటిక్ వేరియెంట్స్ కోసం మల్టి-డ్రైవ్ మరియు ట్రాక్షన్ మోడ్స్ తో పాటు ప్యాడల్ షిఫ్టర్స్ ని కూడా విస్తరించింది. సైడ్ ఎయిర్ బ్యాగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ (ఈఎస్ సీ), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), బ్రాకే అసిస్ట్ (బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), హైలైన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం (హైలైన్ టీపీఎంఎస్) మరియు ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఎన్నో ఇతర భద్రతా ఫీచర్స్ కూడా ప్రామాణికంగా నవీకరించబడిన కియా సెల్టోస్ పై అందచేయబడ్డాయి. ఇంకా, వాహనం యొక్క ద హెచ్ టీఎక్స్ + రకం కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ని కూడా కలిగి ఉంది. ఇంకా, వాహనం రూపం మరింత ఆకర్షణీయంగా ఉండటానికి డీ-కట్ స్టీరింగ్ వీల్, ఎస్ యూఎస్ స్కఫ్ ప్లేట్ మరియు టెయిల్ గేట్ పై సెల్టోస్ లోగోలో డిజైన్ మార్పులు చేయబడ్డాయి. సెల్టోస్ ఎక్స్ లైన్ విషయంలో, అది ఇప్పుడు ఇండిగో పేరా సీట్స్ పై ఎక్స్ లైన్ లోగోతో అందచేయబడుతోంది.
నవీకరించబడిన సోనెట్
నవీకరించబడిన కియా సోనెట్ 09 కొత్త మెరుగుదలలతో అభివృద్ధి చేయబడింది. మరింతగా భద్రతని పెంచడానికి వేరియెంట్స్ లో ప్రామాణికంగా అది ఇప్పుడు సైడ్ ఎయిర్ బ్యాగ్ మరియు హైలైన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం (హైలైన్ టీపీఎంఎస్) తో లభిస్తోంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్ సీ), వెహికిల్ స్టెబిలిటి మేనేజ్మెంట్ (వీఎస్ఎం), బ్రేక్ అసిస్ట్ (బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ) వంటి కీలకమైన భద్రతా ఫీచర్స్ ని కంపెనీ ప్రామాణికంగా అన్ని ఐఎంటీ ట్రిమ్స్ లో అందిస్తోంది. ఇంకా, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఇప్పుడు హెచ్ టీఎక్స్ + వేరియెంట్ నుండి లభిస్తాయి. కొత్తగా ఆరంభించబడిన కియా సోనెట్ కస్టమర్స్ హెచ్ టీఎక్స్ వేరియెంట్ నుండి ఆధునిక 10.67 సెం.మీ (4.2") రంగుల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ని పొందుతారు. అందువలన వారు వివరణాత్మకమైన కార్ సమాచారం పొందుతారు మరియు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. నవీకరించబడిన సెల్టోస్ వలే, కొత్తగా ఆరంభించిన నవీకరించబడిన సోనెట్ కూడా డీ-కట్ స్టీరింగ్ వీల్ మరియు టెయిల్ గేట్ పై సోనెట్ లోగోలో డిజైన్ మార్పులు కూడా పొందుతుంది.