Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ తమ రెండవ ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్‌ను మార్చి 6న నిర్వహించడంతో పాటుగా 30 లక్షల రూపాయలను దివ్యాంగులకు సహాయం చేయడం కోసం సమీకరించింది. వీటితో పాటుగా 8 లక్షల రూపాయలను ఇనార్బిట్ మాల్ అందజేసింది.
ఈ సమీకరించిన మొత్తాలతో 35 మంది లబ్ధిదారులకు వీల్‌చైర్స్, కంపాక్ట్ ట్రై సైకిల్స్ మరియు వినికిడి యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి దివ్య దేవరాజన్, ఐఏఎస్ (సెక్రటరీ– కమిషనర్ ఫర్ ఉమెన్, చైల్డ్, డిసేబల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్) ముఖ్యఅతిధిగా పాల్గొనడంతో పాటుగా లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఓ మహోన్నత కారణం కోసం నిర్వహించిన రన్ ద్వారా సమీకరించిన మొత్తాలతో దివ్యాంగులకు సహాయపడుతూ ఈ కార్యక్రమం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ దివ్యాంగులకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా వారికి పలు ఉపాధి అవకాశాలను సైతం పొందే అవకాశం అందిస్తున్నాము. తద్వారా వారు ఆర్థికంగా స్వతంత్య్ర జీవితాలను ఆస్వాదించవచ్చు. నిర్మాణ్ ఎన్జీవో భాగస్వామ్యంతో మేము పలు కంపెనీలలో వారికి చక్కటి ఉపాధి అవకాశాలను అందిస్తున్నాము. దీనికి ఆరంభంగా, మేము వీల్ చైర్స్, కంపాక్ట్ ట్రైసైకిల్, వినికిడి యంత్రాలను ఈ 35 మంది లబ్ధిదారులకు అందించనున్నాము’’ అని శ్రీ శరత్ బెలావడీ, సెంటర్ హెడ్, ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ అన్నారు. ఈ రన్ ఫర్ ఇన్‌క్లూజన్ మారథాన్ అనేది ఓ సీఎస్ఆర్ కార్యక్రమం. ఎన్జీవో నిర్మాణ్ దీనికి మద్దతునందిస్తుంది. దివ్యాంగుల జీవితాలను మెరుగుపరచడంతో పాటుగా వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే నైపుణ్యాలను అందించడం ద్వారా సహాయం చేయనుంది. ఐడీసీఆర్ 2022లో దాదాపు మూడు వేల మంది వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో 90 మందికి పైగా దివ్యాంగులు సైతం ఉన్నారు. తద్వారా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా మరియు మరుపురాని కార్యక్రమంగా మార్చారు.