Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్‌పేలో తాజాగా ఒకే రోజు 10 కోట్ల లావాదేవీల మార్క్ నమోదైనట్లు ఆ సంస్థ తెలిపింది. నెలకు సగటున 250 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని బుధవారం ఆ సంస్థ వెల్లడించింది. నెలవారిగా 16.5 కోట్ల మంది క్రియాశీల వినియోగ దారులున్నారని పేర్కొంది. రోజుకు 10 కోట్ల లావాదేవీలను చేరడమంటే తమ నాణ్యమైన ఇంజనీరింగ్ బృందం యొక్క చిత్తశుద్దికి నిదర్శనమని ఫోన్‌పే సీఈఓ రాహుల్ చారి పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన లావాదేవీలను అందిస్తున్నామన్నారు.