Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస నిల్వ రూ.12వేలకు పెంపు
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారులపై కనీస నిల్వల భారం మోపాలని నిర్ణయించు కుంది. మెట్రో, పట్టణ ప్రాంతా ల్లోని ఖాతాదారులు సేవింగ్స్ ఖాతాల్లో ఇకపై కనీసం రూ.12,000 నిల్వ కొనసాగిం చాలని సూచించింది. ఇంతక్రితం ఇది రూ.10,000గా ఉంది. ఈ నిర్ణయం అన్ని దేశీయ, ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఈజి అకౌంట్, స్మార్ట్ ప్రివిలేజ్ తదితర ఖాతాలకు వర్తించనుంది. కాగా.. చిన్న పట్టణాల్లో కనీస నిల్వ రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2500గా నిర్ణయించింది. ఖాతాదారులు కనీస నిల్వలు కొనసాగించలేకపోతే ఛార్జీల మోత మోగనుంది. కనీస నిల్వ కంటే తక్కువుంటే రూ.100కు రూ.10 చొప్పున జరిమానా విధిస్తుంది. నిల్వను బట్టి కనీసం రూ.50 నుంచి రూ.800 వరకు భారం వేస్తుంది. కాగా ప్రభుత్వ రంగ బ్యాంక్లు రూ.1000 కనీస నిల్వతోనే ఖాతాదారులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఇక జీరో ఎకౌంట్ ఖాతాలకు అయితే ఎలాంటి చార్జీలను వసూలు చేయకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి మద్దతును అందిస్తున్నాయి.