Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది 8 శాతమే వృద్థి
- ద్రవ్యోల్బణంపై ఆందోళన
న్యూఢిల్లీ : భారత జీడీపీ అంచనాలకు ప్రపంచ బ్యాంక్ కోత పెట్టింది. సరఫరా చెయిన్‌లో నెలకొన్న సవాళ్లు, ద్రవ్యోల్బణ సమస్యలు, ఉక్రెయిన్ సంక్షోభం భారత్ సహా దక్షిణా సియా ప్రాంతాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ పరిణామాల మధ్య 2023 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ పెరుగుదల 8 శాతానికే పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం దీన్ని 8.7 శాతంగా అంచనా వేసింది.
''దేశంలో కోవిడ్ కష్టాల ప్రభావం నుంచి ఇప్పటికీ అనేక కుటుంబాలు బయటపడలేదు. లేబర్ మార్కెట్ రికవరీ అసంపూర్తిగానే ఉంది. ద్రవ్యోల్బణం ఒత్తిడి కొనసాగుతుంది. అధిక చమురు, అహారోత్పత్తుల ధరలకు తోడు ఉక్రెయిన్ అంశాలు ప్రజలపై బలమైన ప్రతికూలతను చూపడంతో పాటుగా వారి వాస్తవ ఆదాయాలు ప్రభావితమయ్యాయి.'' అని ప్రపంచ బ్యాంక్ సౌత్ ఏసియా వైస్ ప్రెసిడెంట్ హార్ట్‌విగ్ చఫెర్ పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ వృద్థి రేటు అంచనాలను పెంచింది. ప్రస్తుత ఏడాదిలో ఆ దేశ జీడీపీ 4.3 శాతానికి పెరుగొచ్చని పేర్కొంది. ఇంతక్రితం 3.4 శాతంగా అంచనా వేసింది.
అధిక చమురు ధరలు ఆర్థిక వ్యవస్థలను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, మానిటరీ పాలసీలు ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించింది. అప్పుడే వృద్థి రేటు రికవరీకి అవకాశం ఉందని పేర్కొంది. 2022లో శ్రీలంక జీడీపీ 2.1 శాతం నుంచి 2.4 శాతానికి పెరుగొచ్చని పేర్కొంది. అక్కడ నెలకొన్న తీవ్ర అనిశ్చితితో ఆ దేశ విదేశీ రుణాల్లో అసతూల్యత, విత్త లోటు చోటు చేసుకోనుందని తెలిపింది.