Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్‌లకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై ప్రస్తుతం 4 శాతం వడ్డీ రేటు (రెపో రేటు)ను పెంచనుందని ఎస్బీఐ ఎకోర్యాప్ అంచనా వేసింది. రెపో రేటును పావు శాతం పెంచొచ్చని పేర్కొంది. జూన్‌లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 11 ద్వైమాసిక పరపతి సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్యన కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా ఉంది. కానీ.. దీనికి భిన్నంగా దేశంలో ధరలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుత ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో ఏకంగా 6.95 శాతానికి ఎగిసి 17 మాసాల గరిష్ట స్థాయిలో నమోదయ్యింది. ధరలు పెరుగుదల ఇలాగే కొనసాగితే వచ్చే సెప్టెంబరు వరకు ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో ఉండవచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఎస్బీఐ ఎకోర్యాప్ సహా పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.