Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.33 లక్షల కోట్లకు ఆఫర్
న్యూఢిల్లీ : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌ను అమ్మితే తాను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నానని స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సిఇఒ ఎలన్ మస్క్ అన్నారు. ఒక్కో షేర్‌ను 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజీ కమిషన్‌కు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌కు మస్క్ తెలిపారు. మొత్తంగా 43 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33 లక్షల కోట్లు) చెల్లిస్తానని తెలిపారు. ఇదే విషయమై ట్విట్టర్ సీఈఓ బ్రెట్ టేలర్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. ఇటీవలే ట్విట్టర్లో మస్క్ 9.2 శాతం వాటాను కొనుగోలు చేసి అతిపెద్ద వాటాదారుగా మారారు. ట్విట్టర్లో ప్రధాన వాటా కలిగి ఉన్నప్పటికీ ఆ బోర్డు సభ్యుడిగా చేరడానికి ఇటీవల ఎలన్ విముఖత చూపారు.
గత జనవరి 28న ట్రేడింగ్ ముగింపు ధర ప్రకారం ట్విట్టర్లో 54 శాతం వాటా కొనుగోలు చేస్తామని ఎలన్ ప్రతిపాదించారు. ఈ మొత్తం విలువ 43 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఎలన్ ప్రతిపాదనతో ట్విట్టర్ షేర్ 18 శాతం మేర పెరిగింది. ''ప్రస్తుత రూపంలో ట్విట్టర్ అభివద్ధి చెందలేదని, సామాజిక అవసరాలను తీర్చలేదని గ్రహించాను. ట్విట్టర్ ఒక ప్రయివేటు కంపెనీగా మారాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నా ఉత్తమ ఆఫర్‌ను ఆమోదించకపోతే ట్విట్టర్లో వాటాదారుగా నా స్థానం గురించి పునః పరిశీలించుకోవాల్సి వస్తుంది.'' అంటూ ట్విట్టర్ చైర్మెన్ బ్రెట్ టేయ్లర్కు ఎలన్ లేఖ రాశారు.