Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) ఉత్పత్తి చేస్తున్న సబ్బులు, సర్పులు (డిటర్జెంట్ల), షాంపు ధరలను మరోసారి పెంచింది. ఈ ఆసారి డవ్, పియర్స్, లైఫ్‌బారు, వీల్, విమ్ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు పేర్కొంది. ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు కారణమని ఆ కంపెనీ తెలిపింది. ముఖ్యంగా డవ్, పియర్స్ సబ్బుల ధరలను ఏకంగా 20 శాతం పెంచింది. లైఫ్‌బారు నాలుగు సబ్బుల ప్యాక్ ఖరీదును రూ.124 నుంచి 138కి చేర్చింది. 500 గ్రాముల వీల్ డిటర్జెంట్ ధర రూ.32 నుంచి రూ.33కి, ఒక్క కిలో డిటర్జెంట్ ధర రూ.63. నుంచి రూ.85కు పెంచింది. గడిచిన ఫిబ్రవరిలోనూ ఈ కంపెనీ పలు ఉత్పత్తుల ధరలను పెంచేసింది. తాజా పెంపునతో కుటుంబాల బడ్జెట్‌పై మరింత ఒత్తిడి చోటు చేసుకోనుంది.