Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెవీ డ్యూటీ ట్రక్ ట్రయల్స్ ప్రారంభం
హైదరాబాద్ : విద్యుత్ బస్సుల తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఒలెక్ట్రా) ఇటీవల తన ఉత్పత్తి పోర్టుపోలియోను ట్రక్ విభాగంలోకి విస్తరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే శుక్రవారం 6/4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్‌ను విజయవంతంగా ప్రారంభించినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఒక్కసారి ఛార్జితో 220 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. ఈ టిప్పర్ 25 శాతం డ్యూటీ బోగీ సస్పెన్షన్ గ్రేడబిలిటీ (ఎత్తయిన రోడ్లూ, ఘాట్ రోడ్లు) కూడా కలిగి ఉంటుందని వెల్లడించింది. త్వరలో హైదరాబాద్ శివార్లలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కానుందని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామిగా ఉన్న, ఒలెక్ట్రా ఇప్పుడు హెవీ డ్యూటీ టిప్పర్ ట్రయల్స్‌ను ప్రారంభించిందన్నారు. దేశంలో ఈ రకమైన ట్రక్ ఇదే మొదటిది కావడం గర్వకారణమని ప్రదీప్ పేర్కొన్నారు.