Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జపనీస్ వాహన కంపెనీ హౌండా కార్స్ తన ఎలక్ట్రిక్ హైబ్రిడ్ 'న్యూ సిటి ఇ'ని ఆవిష్కరించినట్లు తెలిపింది. దీంతో తాము భారత మార్కెట్లో తొలిసారి విద్యుత్, ఇంధన హైబ్రిడ్ వాహన రంగంలోకి ప్రవేశించినట్లయ్యిందని ఆ కంపెనీ వెల్లడించింది. వచ్చే నెలలో అందుబాటులోకి రానున్న ఈ మోడల్ కోసం ముందస్తు బుకింగ్లు ప్రారంభించినట్లు తెలిపింది. సెల్ఫ్ చార్జింగ్ కలిగిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ లీటర్కు 26.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని పేర్కొంది.