Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడానికి స్పెస్ఎక్స్ అధినేత, టెస్లా సిఇఒ ఎలెన్ మాస్క్ మరో ప్రణాళిక వేస్తున్నారు. ట్విట్టర్‌ను 43 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.2 లక్షల కోట్లు)తో స్వాధీనం చేసుకోవడానికి ఆయన ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన ఎలెన్.. తాజాగా ట్విట్టర్ మొత్తాన్ని దక్కించుకునే దానిపై దృష్టి సారించారు. ''నేనిచ్చిన 43 బిలియన్ డాలర్ల ఆఫర్‌తో ట్విట్టర్ నా సొంతం అవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేను. అయితే నా ఆఫర్‌ను ట్విట్టర్ బోర్డు తిరస్కరిస్తే, నా దగ్గర ప్లాన్ -బి కూడా ఉంది'' అని మస్క్ అన్నారు. అయితే ఆ ప్లాన్ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.