Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఈరోజు (ఏప్రిల్ 18) సోమాజిగూడలోని హోటల్ పార్క్‌లో బిపిపి యూనివర్సిటీ ఉన్నతస్థాయి ప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి వివిధ స్టేక్‌హోల్డర్స్ హాజరయ్యారు. వారు బిపిపి విశ్వవిద్యాలయ ఉన్నత స్థాయి ప్రతినిధులతో సంభాషించారు.
లండన్ కు చెందిన బిపిపి గ్రూప్‌లో భాగం అయిన బిపిపి విశ్వవిద్యాలయం స్వంతంగా డిగ్రీ అవార్డ్ చేయగల అధికారాలను కల్గిన ఒక ప్రత్యేక చట్టపరమైన సంస్థ. అంకితమైన మేనేజ్మెంట్ టీమ్‌తో, ఇది గవర్నెన్స్, ఎడ్యుకేషనల్ ప్రొవిజన్, రిసోర్సింగ్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది.
యూనివర్శిటీ ప్రతినిధులు యూనివర్శిటీ అందిస్తున్న వివిధ కోర్సుల గురించి హాజరయిన స్టేక్‌హోల్డర్స్‌కు తెలియజేశారు. విశ్వవిద్యాలయం కేవలం అకడమిక్ గానే కాకుండా ఉపాధి అవకాశలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుందని ప్రతినిధులు చెప్పారు. రస్సెల్ గ్రూప్ చేసిన 24 ప్రముఖ విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్ ఫలితాల సర్వేలో, బిపిపి విశ్వవిద్యాలయం పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు అధిక నైపుణ్యం కలిగిన వృత్తులలో ఉపాధిలోకి వెళ్లి 1వ స్థానంలో నిలిచింది.
2007లో,బిపిపి విశ్వవిద్యాలయం యూకేలో డిగ్రీ అవార్డ్ చేయగల అధికారాలను పొందిన మొట్టమొదటి పబ్లిక్ యాజమాన్య సంస్థగా చరిత్ర సృష్టించింది.
సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ గత ఇన్‌టేక్ సమయంలో 1000 కంటే ఎక్కువ మంది విద్యార్థులను బిపిపి యూనివర్శిటీకి ఎటువంటి ఫిర్యాదు, ఇబ్బందులు మరియు అవంతరాలు లేకుండా పంపారు.