Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకర్ అయినా ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 15 నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. దీంతో ఎస్బిఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు మరో 0.10 శాతం పెరగనుంది. ఈ సవరణ ప్రస్తుత, భవిష్యత్తు రుణగ్రహీతలకు వర్తిస్తుందని తెలిపింది. దీంతో రుణ వాయిదాలు చెల్లించే వారు ఇకపై కొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.