Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనీలాండరింగ్‌పై విచారణ
న్యూఢిల్లీ : గొలుసుకట్టు ఉత్పత్తుల (మల్టీలేవల్ మార్కెటింగ్) విక్రయ సంస్థ ఆమ్వేకు చెందిన రూ.757 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇడి విచారణ చేపడుతోంది. దీంతో ఆ కంపెనీకి చెందిన స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లతో పాటుగా రూ.346 కోట్ల నగదును స్తంబింపజేసింది. ఆమ్మేకు చెందిన తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఫ్యాక్టరీ, ఫర్నీచర్, మెషినరీలతో పాటు ఈ కంపెనీకి చెందిన 36 బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసినట్లు ఇడి వెల్లడించింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీల ఉత్పత్తుల ధరలు సాధారణ మార్కెట్ ఉత్పత్తుల కంటే అధిక ధరల్లో ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యాపారంలో ఆయా సంస్థలు భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇడి అధికారులు ఆమ్వేపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి.. విచారణ చేపడుతున్నారు.