Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జాతీయ ప్రాముఖ్యంగల ఎలక్ర్టానిక్స్ ఉత్పత్తుల కోసం భారతీయ ఉత్పత్తుల, భారతీయ బ్రాండ్ల స్పష్ట ద్వారా భారతీయ ఎలక్ర్టానిక్స్ పునరుజీవం లక్ష్యంగా లాభాపేక్ష రహిత సంస్థ ఇపిఐసి(ఎపిక్) ఫౌండేషన్‌ను హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ చౌదరీ హెచ్‌సిఎల్ సహా వ్యవస్థాపకుడు అర్జున్ మల్హోత్రా, సెమికండక్టర్ పరిశ్రమ వెటరన్ డాక్టర్ సత్యగుప్తాలతో కలసి స్థాపించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె సరస్వత్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఢిల్లీ డైలాగ్, డెవలప్మెంట్ కమిషన్ వైస్ చైర్ పర్పన్ జాస్మిన్ షా, కేంద్ర సైన్స్ టెక్నలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ఎంఇఐటివై సంయుక్త కార్యదర్వి అమితేశ్ కుమార్ సిన్హా తదితర ప్రముఖలు పాల్గొన్నారు. 70 కోట్ల ఎల్ ఇ డి చిప్‌లు, ఒక కోటి స్వదేశి ట్యాబ్‌ల ఉత్పత్తికి వీలు కల్పిస్తూ ఆత్మనిర్భర్ భారత్‌కు దన్నుగా నిలవడం, భారతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు 45 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను సృష్టించడం ఫౌండేషన్ లక్ష్యం.