Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ బుక్ ఫెయిర్‌ను కితాబ్ లవర్స్ నిర్వహించబోతున్నారు. ఈ బుక్ ఫెయిర్‌లో వేలాది మంది రచయితలు వేలాది అంశాలపై రచించిన 2 లక్షలకు పైగా పుస్తకాలను ప్రదర్శించనున్నారు. భారీ సంఖ్యలో రచయితలు, విద్యార్థులు, పుస్తక ప్రియులను ఈ బుక్ ఫెయిర్ ఆహ్వానిస్తోంది.
ఈ సమాచారాన్ని నిర్వహణ బృంద సభ్యుడు, పుస్తక ప్రేమికుడు హర్‌ప్రీత్ సింగ్ చావ్లా వెల్లడించారు. ఆయన ఈ ప్రదర్శనకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ పంజాగుట్ట మెట్రో స్టేషన్ ప్రాంగణం వద్ద ఉన్న ఎక్స్పో గ్యాలరియాలో ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకూ ఈ ప్రదర్శన చేయనున్నామన్నారు. ఈ ప్రదర్శన ముఖ్యోద్దేశ్యం, ఈ డిజిటల్ ప్రపంచంలో పుస్తకాలు, సాహిత్యానికి దూరంగా ఉన్న యువతకు పుస్తక ఆవశ్యకతను తెలుపడం. చేతిలో పుస్తకం ఉంచుకుని చదువుతుంటే ఆ ఆనందం విభిన్నంగా ఉంటుంది అని అన్నారు. ఈ సంస్థ ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 16 ప్రదర్శనలను చేసింది. ఈ ప్రదర్శనలను గురించి ఆయన మరింతగా వెల్లడిస్తూ వేలాది మంది రచించిన 2 లక్షలకు పైగా పుస్తకాలను ప్రదర్శించనున్నామన్నారు. వీటిలో బయోగ్రఫీ, క్రైమ్, అస్ట్రాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్, కుకింగ్, డిక్షనరీస్, ఫోటోగ్రఫీ, వైల్డ్‌లైఫ్, ఎన్సైక్లోపిడియా, రొమాన్స్, ఫ్యాంటసీ, మతం, శాస్త్రం వంటి వాటితో పాటుగా సాహిత్యం, స్టోరీ టెల్లింగ్, కవిత్వ పుస్తకాలు కూడా ఉంటాయి. ఇంగ్లీష్. హిందీ భాషలలో వేలాది మంది రచయితలు రచించిన పుస్తకాలను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో పలు అంశాలలో అత్యుత్తమ విక్రయాలు జరుపబడిన పుస్తకాలను సైతం ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనను కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు చావ్లా తెలిపారు.