Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ కన్స్యూమర్ అప్లయెన్సస్ బ్రాండ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ , తమ సాంకేతికంగా అత్యున్నత శ్రేణి ఫ్యాన్లను నూతన మల్టీ మీడియా ప్రచారం, 'ఫ్యాన్ నహీ ఫెంటాస్టిక్` ద్వారా విడుదల చేసింది. వినియోగదారులు ఆహ్లాదకరమైన అనుభవాలను పొందేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ బ్రాండ్ యొక్క వినియోగదారుల అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, ఆధునిక భారతీయ వినియోగదారులు నూతన తరహా ఫీచర్లను ఫ్యాన్లులో చూస్తున్నారు. ఫ్యాన్స్ కొనుగోలులో వారు ప్రధానంగా మూడు అంశాలను చూస్తున్నారు. అవి ఫ్యాన్ యొక్క వేగం, అతి తక్కువ శబ్దం మరియు హోమ్ డెకార్ ఆకర్షణను వృద్ధి చేసే సౌందర్యం. బజాజ్ ఎలక్ట్రికల్స్ తాజా ఆఫరింగ్ ఈ అవసరాలను తీర్చనుంది. ఈ శ్రేణిలో సూపర్ హై స్పీడ్ 425 ఆర్పీఎం ఫ్యాన్స్ ఉన్నాయి. ఇవి వేగవంతమైన సౌకర్యం, తగ్గించబడిన శబ్ద స్థాయిలు అందిస్తాయి. సీలింగ్, టవర్, పెడస్టల్ శ్రేణిలో ప్రీమియం విభాగంగా ఇవి అందిస్తాయి. ఈ నూతనంగా ఆవిష్కరించబడిన మోడల్స్‌ను సుప్రసిద్ధ రిటైల్ ఔట్లెట్లు, ఈ–కామర్స్ వెబ్సైట్లు మరియు https://shop.bajajelectricals.com వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్రచారం గురించి బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ , బిజినెస్ హెడ్ఆఫ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కృష్ణ రామన్ మాట్లాడుతూ 'మేము వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడంతో పాటుగా సూపర్ హై స్పీడ్, సెలైంట్, డెకరేటివ్ ఫ్యాన్లను అందిస్తున్నాం. ఈ తాజా ప్రచారం, ఫ్యాన్ 'నహీ ఫెంటాస్టిక్` అనేది అత్యంత ఆసక్తికరమైన నేటి తరపు మారుతున్న అభిరుచులకు అద్దం పడుతుంది. ఈ తాజా శ్రేణితో, మేము ఫ్యాన్స్ కనీస అవసరాలకు ఆవల వెళ్లడంతో మా వినియోగదారుల రోజువారీ జీవితాలతో అత్యంత సౌకర్యంగా మిళితం కాగలదు` అని అన్నారు.
మల్టీమీడియా ప్రచారం ఫ్యాన్నహీ ఫెంటాస్టిక్ ను https://youtu.be/x8n7HCObbNE వద్ద చూడవచ్చు.
ఈ తరహా వినూత్నమైన, అత్యాధునిక ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా ఈ బ్రాండ్ తమ స్థానాన్ని పునరుద్ఘాటించడంతో పాటుగా ఈ ఫ్యాన్ల విభాగంలో వినియోగదారుల ప్రాధాన్యతా ఎంపికగా నిలువాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.