Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశపు మొట్టమొదటి యాక్టివ్ లిక్వడ్ కూల్డ్ 2 వీలర్ ఈవీ బ్యాటరీ ప్యాక్
హై వోల్టేజీ, హై పెర్ఫార్మెన్స్ బ్యాటరీ ప్యాక్‌ను భద్రత, రక్షణ, విశ్వసనీయత,పనితీరు వంటి లక్షణాలతో తీర్చిదిద్దారు
సూపర్స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్ధతో సమృద్ధి
మ్యాటర్ యొక్క త్వరలో విడుదలకానున్న ద్విచక్ర ఈవీని శక్తివంతం చేసే బ్యాటరీ ప్యాక్, 2022లో విడుదల చేయనున్నారు
అహ్మదాబాద్ : సాంకేతిక స్టార్టప్ మ్యాటర్, తమ మ్యాటర్ ఎనర్జీ 1.0 బ్యాటరీ ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు సూపర్స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్ధ వంటి వాటిని కలిగిన వినూత్నమైన బ్యాటరీ ప్యాక్ ఇది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను ఫ్యూచర్ మొబిలిటీని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేశారు. వాహన భద్రతకు పూర్తి భరోసానందిస్తూనే అత్యుత్తమ శ్రేణిని అందిస్తుంది. భద్రత, రక్షణ, విశ్వసనీయత మరియు పనితీరు లక్ష్యంగా సాంకేతికత, పరిశోధన మరియు ఆవిష్కరణలపై ఎప్పుడూ దృష్టి కేంద్రీకరించే మ్యాటర్, భారతీయ వాతావరణ మరియు వినియోగ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ బ్యాటరీ ప్య్జాక్ను అభివృద్ధి చేసింది.
బ్యాటరీ ప్యాక్ యొక్క ముఖ్య ఆకర్షణలు :
అధిక శక్తి సాంద్రత
ఐపీ67 రేటింగ్‌తో బ్యాటరీ ప్యాక్
గరిష్ట సిస్టమ్ సామర్థ్యం, భద్రత మరియు విశ్వసనీయత కోసం సూపర్స్మార్ట్ బీఎంఎస్
సరైన బ్యాటరీ పనితీరుకు హామీ ఇవ్వడానికి సెన్సార్ సిస్టమ్‌లు ఉపయోగించబడతాయి
ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్
పెర్ఫార్మెన్స్ 2 వీలర్స్ కోసం హై వోల్టేజీ ఎనర్జీ ప్యాక్
మ్యాటర్ ఫౌండర్ అండ్ సీఈవో మొహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ 'బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల భద్రత మరియు పనితీరు వాటి సాధ్యత మరియు ఆమోదయోగ్యతకు అంతర్భాగమైనందున, విద్యుత్ ద్విచక్రవాహన పరిశ్రమ అవసరాలను తీర్చగల అత్యంత ప్రయోజనకరమైన బ్యాటరీ ప్యాక్‌ను మ్యాటర్ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాలు ప్రధాన స్రవంతిలోకి రావాలంటే, సిమ్యులేషన్ ఇంటెన్సివ్‌గా ఉత్పత్తి డెవలప్మెంట్ సైకిల్ ఉండటంతో పాటుగా విశ్వసనీయత మరియ భద్రత కోసం ధృవీకరించబడిన మరియు పూర్తిగా అభివృద్ది చేయబడిన ఉత్పత్తి పై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. బ్యాటరీ ప్యాక్ డిజైన్ మరియు అభివృద్ధిలో ఈ విధానాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మ్యాటర్ ఎనర్జీ 1.0 ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ బ్యాటరీ ప్యాక్. ఇది పూర్తిగా చార్జ్ చేయబడి ఉండటంతో పాటుగా భారతదేశంలో ఈవీ ద్విచక్రవాహనాలను శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉంది`అని అన్నారు.
ఈ బ్యాటరీ కేసింగ్‌ను తేలికపాటి లోహంతో తయారుచేశారు. ఇది ఇతర మెటీరియల్స్‌తో పోలిస్తే వేడిని చక్కగా పీల్చుకుంటుంది. భద్రత, బ్యాటరీ లైఫ్, ప్యాక్ యొక్క పనితీరుకు అమిత ప్రాధాన్యతను మ్యాటర్ అందిస్తుంది. బ్యాటరీ ప్యాక్‌లో వినియోగించిన ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్ధ (ఐఐటీఎంఎస్) యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ వ్యవస్ధగా వినియోగించడం వల్ల ప్యాక్ యొక్క అన్ని భాగాల యొక్క వాంఛనీయ పనితీరును నిర్థారిస్తుంది.
భారతదేశంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు, భూభాగాలూ ఉన్నాయి. మన దేశం అందించే ఈ వైవిధ్యతకు తగినట్లుగా మా సాంకేతికత ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే అంశమేమిటంటే, మా విశ్లేషణ ఆధారిత ఉత్పత్తి అభివృద్ధి వ్యూహం, నిరంతర ఆవిష్కరణ. దీనిలో బ్యాటరీ ప్యాక్ సాంకేతికత, బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్ధ (బీఎంఎస్) మరియు ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్ధ కూడా భాగంగా ఉంటాయి. మన దేశపు వైవిధ్యతను పరిగణలోకి తీసుకుని వీటిని రూపొందించడంతో పాటుగా అభివృద్ధి చేయడం జరిగింది. మ్యాటర్ ఎనర్జీ 1.0 ను అంతర్గతంగా అభివృద్ధి చేయడం జరిగింది. వీటిలో అత్యంత కీలకమైన ఆవిష్కరణలు సైతం ఉన్నాయి. వీటిలో సూపర్ స్మార్ట్ బీఎంసీ సైతం ఉంది. దీనిని ప్రత్యేకంగా అత్యున్నత స్ధాయి భద్రత, విశ్వసనీయత, పనితీరుకు భరోసా అందిస్తూ అభివృద్ధి చేశారు.