Authorization
Mon Jan 19, 2015 06:51 pm
● నూతన మరియు రిటర్నిగ్ ఇన్వెస్టర్ల నుంచి సిరీస్ డీ రౌండ్‌ను ఓవర్సబ్స్ర్కిప్షన్తో ముగించింది
● భారతదేశంలో క్రిప్టో మరియు వెబ్ 3 పరిశ్రమ వృద్ధి మరియు పోషణపై దృష్టి
● విద్య, ఆవిష్కరణ, అంగీకారం వంటివి కంపెనీకి కీలకమైన నేపథ్యాలుగా నిలిచాయి
ముంబై, ఏప్రిల్ 20, 2022 : భారతదేశంలో క్రిప్టో రంగంలో సుప్రసిద్ధ సంస్థ కాయిన్‌డీసీఎక్స్ (CoinDCX)తమ ఓవర్ సబ్‌స్రైబ్డ్ రౌండ్‌ను తమ సిరీస్ డీ ఫండింగ్‌లో 135 మిలియన్ డాలర్లతో ముగించింది. ఈ రౌండ్‌కు పంటేరా మరియు స్టెడ్‌వ్యూ నేతృత్వంలోని ఈ రౌండ్లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్లు అయినటువంటి కింగ్స్‌వే, డ్రాపర్ డ్రాగన్, రిపబ్లిక్ , కిండర్డ్ ఉన్నాయి. ఈ తాజా ఫండింగ్ రౌండ్లో ప్రస్తుత మదుపరులు అయినటువంటి బీ క్యాపిటల్ గ్రూప్, కాయిన్‌బేస్, పాలీచైన్, కాడెంజా తమ పెట్టుబడులును కాయిన్ డీసీఎక్స్లో పెంచుకోవడం ద్వారా భారతదేశంలో క్రిప్టో/వెబ్ 3 పరిశ్రమ వృద్ధి కి బలీయమైన మద్దతునందిస్తున్నాయి.
ఈ తాజా రౌండ్‌తో, కాయిన్‌డీసీఎక్స్ తమ గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను భారతదేశంలో ఉన్న అపార అవకాశాల పరంగా పునరుద్ధరించింది. ఈ రౌండ్ యొక్క పరిమాణం మరియు వైవిధ్యమైన మదుపరులు గత కొద్ది సంవత్సరాలుగా కాయిన్ డీసీఎక్స్ పొందుతున్న స్థిరమైన మద్దతుకు నిదర్శనం. ఈ రౌండ్‌తో కాయిన్ డీసీఎక్స్, భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన క్రిప్టో కంపెనీగా నిలిచింది.
విద్య, ఆవిష్కరణ,సమ్మతి వంటివి కాయిన్‌డీసీఎక్స్ వ్యూహంలో అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ రౌండ్‌తో ఈ బలాలపై వారు స్ధిరంగా అభివృద్ధి చెందుతున్నారు.
అవగాహన మెరుగుపరచడం మరియు భారతీయ మదుపరులకు క్రిప్టో మరియు బ్లాక్‌చైన్ పట్ల అవగాహన కల్పించడానికి కాయిన్‌డీసీఎక్స్ కట్టుబడి ఉంది. కాయిన్‌డీసీఎక్స్ ఇప్పటికే పలు విద్యా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభించి యూనివర్శిటీలతో అతి సన్నిహితంగా పనిచేస్తుంది. ఈ అభివృద్ధి చెందుతున్న ఎస్సెట్ క్లాస్ పట్ల నమ్మకం మరియు అవగాహనను మెరుగుపరచడంలో డీసీఎక్స్ లెర్న్ ప్లాట్‌ఫామ్ తోడ్పడుతుంది. కాయిన్‌డీసీఎక్స్ ఇప్పుడు ఓ ఇన్నోవేషన్ కేంద్రాన్ని భారతదేశంలో వెబ్ 3 మరియు బ్లాక్‌చైన్ స్వీకరణ కోసం ప్రారంభించింది.
ఆవిష్కరణ అనేది కంపెనీకి అత్యంత కీలకమైన అంశంగా నిలిచింది. పలు వినూత్నమైన ఉత్పత్తులను మరియు ఫీచర్లను కాయిన్‌డీసీఎక్స్ ఆవిష్కరించడంతో పాటుగా సమాచారయుక్తంగా బాధ్యతాయుతమైన పెట్టుబడులను పెట్టాల్సిందిగా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు , ఈ కంపెనీ భారీ స్థాయిలో పెట్టుబడులను తమ ప్లాట్‌ఫామ్ మరింత విస్తృతంగా మరియు వినియోగదారులు వినియోగించేందుకు సురక్షితంగా ఉండేందుకు పెడుతుంది.
రిస్క్ మేనేజ్మెంట్ మరియు కాంప్లియెన్స్ ఫ్రేమ్‌వర్క్స్ పరంగా కాయిన్‌డీసీఎక్స్ పూర్తి నిబద్ధతను చాటుతుంది. తమ 7ఎం ప్రిన్సిపల్ ఇవల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ద్వారా, అన్ని ప్రాజెక్ట్‌లూ పరిశీలించబడతాయి మరియు ఆ తరువాత మాత్రమే తగిన శ్రద్ధతో అనుమతించబడతాయి. కాయిన్‌డీసీఎక్స్ ఇటీవలనే క్రిప్టో నేటివ్ ట్రేడ్ సర్వైవలెన్స్ తో భాగస్వామ్యం చేసుకుంది. అలాగే మార్కెట్ ఇంటెగ్రిటీ లీడర్స్ అయినటువంటి సోలిడస్ల్యాబ్స్ మరియు కాయిన్ ఫర్మ్ వంటి వాటితో భాగస్వామ్యం కలిగి ఉంది. దీని యాంటీ మనీ లాండ్రింగ్ ప్రొటెక్షన్ బలోపేతం చేయడానికి, అనుమానాస్పద కార్యకలాపాలను ఖచ్చితంగా మరియు సంపూర్ణంగా గుర్తించి నివేదించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ భాగస్వామ్యాలు కాయిన్‌డీసీఎక్స్ యొక్క సమ్మతిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిఫార్సులతో మెరుగుపరుస్తాయి. మనీలాండరింగ్ మరియు ఆర్థిక ఉగ్రవాదంను ఎదుర్కోవడానికి , దాని ప్రస్తుత స్థితిని బలోపేతం చేస్తాయి.
భారతదేశపు క్రిప్టో/వెబ్3 పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే తమ లక్ష్యానికి మద్దతునందిస్తూ కాయిన్‌డీసీఎక్స్ తమ ప్రతిభావంతులను మూడు రెట్లు వృద్ధి చేసుకుని 1000 మంది ఉద్యోగులకు 2022 చివరి నాటికి వృద్ధి చేయనుంది. కాయిన్‌డీసీఎక్స్ స్థానిక ప్రతిభావంతులను పలు ఔట్రీచ్ కార్యక్రమాలు, పరిశోధనా కార్యక్రమాలు, వ్యూహాత్మక పెట్టుబడులను ద్వారా పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
'కొంతమంది భారీ సంస్ధాగత పెట్టుబడిదారుల తాజా రౌండ్ క్రిప్టో పర్యావరణ వ్యవస్థలో భారతదేశపు అపారమైన సామర్థ్యంపై నమ్మకాన్ని బలపరుస్తుంది. డిజిటల్ ఫస్ట్ ఆర్థిక వ్యవస్ధ యొక్క భాగస్వామ్య దృష్టితో మేము ఈ రౌండ్‌ను ఇన్నేండ్లుగా ఈ పర్యావరణ వ్యవస్ధ అభివృద్ధి కోసం కాయిన్ డీసీఎక్స్ చేసిన కృషి మరియు భవిష్యత్ కోసం మా ప్రణాళికలకు బలమైన ఆమోదంగా చూస్తున్నాము` అని కాయిన్‌డీసీఎక్స్ కో ఫౌండర్, సీఈఓ సుమిత్ గుప్తా అన్నారు.
ఆయనే మాట్లాడుతూ 'భారతదేశం కోసం విస్తృత శ్రేణిలో ఉత్పత్తులు మరియు సమ్మతి, సరళవంతమైన మరియు సురక్షిత పరిష్కారాలను నిర్మించాలనే నిబద్ధతతో రెగ్యులేటర్లు, పరిశ్రమ మరియు మా వినియోగదారుల నడుమ మరింత అవగాహన , నమ్మకం ఏర్పరచడంలో సహాయపడటానికి మేము ప్రత్యేకమైన స్ధానంలో ఉన్నాము. తద్వారా భారతదేశంలో క్రిప్టో స్వీకరణ మరియు మరింతగా వెబ్ 3.0 దిశగా వెళ్లేందుకు సహాయపడుతుంది` అని అన్నారు.
'దేశంలో అగ్రగామి క్రిప్టో వేదికలలో ఒకటిగా కాయిన్‌డీసీఎక్స్ నిలువడం పట్ల సంతోషంగా ఉన్నాము. వారు నూతన రిటైల్ మరియు సంస్ధాగత ఉత్పత్తులను భారతదేశంలో క్రిప్టో మౌలిక వసతులకు జోడిస్తున్నారు. ఈ ప్రక్రియలో కాయిన్‌డీసీఎక్స్ క్రిప్టో వినియోగానికి నూతన వినియోగదారుల కోసం వెబ్ 3 స్పేస్‌కు గేట్వేగా నిలుస్తుంది. సుమిత్, నీరజ్లతో మా భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడంతో పాటుగా కాయిన్‌డీసీఎక్స్ యొక్క అసాధారణ బృందంతో చేతులు కలపడం పట్ల సంతోషంగా ఉన్నాము. తద్వారా భారతదేశపు క్రిప్టో ల్యాండ్‌స్కేప్ ప్రయాణానికి ఓ ఆకృతిని అందించనుంది` అని కబీర్ నారంగ్, ఫౌండింగ్ జనరల్ పార్టనర్, బీ క్యాపిటల్ గ్రూప్ అన్నారు
ఈ సందర్భంగా పౌల్ వెరాదిత్కిట్ - పంటెరా మాట్లాడుతూ 'భారతదేశంలో పంటెరా ప్రారంభ మరియు చురుకైన మద్దతుదారునిగా ఉంది మరియు దేశంలో వేగవంతంగా పెరుగుతున్న వెబ్ 3 వినియోగ కేసులలో మేము తొలుత ఉన్నామని విశ్వసిస్తున్నాము. అలాగే వెబ్ 3 రంగంలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలుపుతున్నాము. కాయిన్‌డీసీఎక్స్‌లో పెట్టుబడి పెట్టడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వారి స్పష్టమైన వ్యూహం, పట్టుదల, అమలు సామర్థ్యాల పట్ల మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము. కాయిన్‌డీసీఎక్స్ యొక్క వినూత్నమైన మరియు అనుకూలమైన ఉత్పత్తుల సూట్ వినియోగదారులకు మరియు సంస్థలను డిజిటల్ ఆస్తులు మరియు వెబ్ 3 లోకి నడిపిస్తుందని మేము విశ్వసిస్తున్నాము` అని అన్నారు.
'భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న వెబ్3 ఎకోసిస్టమ్ నిర్మించడంలో కాయిన్‌డీసీఎక్స్ లక్ష్యం పట్ల మేము ఆకర్షితులయ్యాం మరియు 2021లో మా ప్రారంభ పెట్టుబడులను అనుసరించి భారతదేశంలో వినియోగదారుల లక్ష్యిత, మహోన్నత ఫీచర్లు కలిగిన క్రిప్టో ఎక్సేంజ్ నిర్మించడంలో టీమ్ అమలుకు మద్దతు ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వెబ్ కంపెనీలలో ఒకటైన వృద్ధికి తోడ్పడేందుకు మా పెట్టుబడులను మరింతగా పెంచడం పట్ల సంతోషంగా ఉన్నాము` అని రవి మోహతా, మేనేజింగ్ డైరెక్టర్, స్టెడ్‌వ్యూ అన్నారు.