Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రత్యేకించి మెర్సిడిస్-బెంజ్ కస్టమర్ల కొరకు’ మొదటగా బుకింగ్లను ప్రారంభిస్తోంది. బేబీ ఎస్-క్లాస్ ఇండియాలో మొట్టమొదట మే నెల 10 వ తేదీన ప్రవేశిస్తోంది.
• మెర్సిడిస్-బెంజ్ ఇండియా, ఇండియాలో ఈ విభాగములో అత్యంత విజయవంతమైన మోడల్స్ లో ఒకటిగా చేస్తూ సి-క్లాస్ యొక్క సుమారు 37,000 యూనిట్లను విక్రయించింది.
• బేబీ ఎస్-క్లాస్: కొత్త తరం మెర్సిడిస్-బెంజ్ సి-క్లాస్ (W206) అనేది నవీన సృజనాత్మక టెక్నాలజీ యొక్క విస్తృత శ్రేణిని, సర్వశ్రేష్టమైన సౌకర్యాన్ని మరియు ఫ్లాగ్షిప్ ఎస్-క్లాస్ నుంచి డిజైన్ కలిగి ఉంటుంది.
• మెర్సిడిస్-బెంజ్ సి-క్లాస్ ప్రారంభ సమయములో మూడు వేరియంట్లను కలిగి ఉంటుంది: సి200, సి220డి, అగ్రస్థాయి సి300డి
• కొత్త సి-క్లాస్ కోసం ఇదివరకే అన్ని మార్కెట్ల వ్యాప్తంగా కస్టమర్ల ఆసక్తి గణనీయంగా ఉంది.
• కొత్త సి-క్లాస్ కోసం బుకింగ్ మొత్తము రు.50,000 గా ఉంది.
హైదరాబాద్: భారతదేశం యొక్క అతిపెద్ద లగ్జరీ కారు తయారీదారు అయిన మెర్సిడిస్-బెంజ్ ఇండియా, ప్రత్యేకించి మెర్సిడిస్-బెంజ్ కస్టమర్ల కోసం సరికొత్త మెర్సిడిస్-బెంజ్ సి-క్లాస్ బుకింగులను 2022 ఏప్రిల్ 13 నుంచి మొదలుపెట్టి 30వ తేదీ వరకూ చేస్తున్నట్లుగా నేడు ప్రకటించింది. మిగిలిన భవిష్య ఆశావహులకు బుకింగులు మే నెల 1 వ తేదీ తర్వాతి నుండీ మొదలవుతాయి. కారు కోసం బుకింగ్ మొత్తము రు.50,000 గా ఉంటుంది. ప్రవేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా కోసం కొత్త తరం మెర్సిడిస్-బెంజ్ సి-క్లాస్ 10 వ తేదీ, మే నెల 2022 న వస్తోంది. దాని భాగస్వామ్య నెట్వర్క్ వ్యాప్తంగానూ, మెర్సిడిస్-బెంజ్ ఇండియా ఆన్లైన్ స్టోర్ వద్ద కూడా డిజిటల్ గా అందుబాటులో ఉంటుంది.
మెర్సిడిస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, “మా విభాగములో సి-క్లాస్ అనేది ఒక ముఖ్యమైన ఉత్పాదన, మరింత ఎక్కువగా అందజేస్తూ మా లగ్జరీ సెడాన్ ని బలోపేతం చేస్తుంది. ప్రతీ కొత్త తరం తోనూ, సి-క్లాస్ యొక్క విశ్వసనీయ కస్టమర్లు తన సర్వశ్రేష్టమైన సౌకర్యం, సాంకేతికపరమైన ఆధునికత, నూతనోద్భవ డిజైన్ కలిగియున్న కారును కొనడానికి ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త సి-క్లాస్ ఇప్పుడు కొత్త ఎస్-క్లాస్ వైపుకు సన్నిహితంగా కదులుతూ బేబీ ఎస్-క్లాస్ గా తన ప్రజాదరణను సరైన విధంగా పెంచుకుంటూ డిజైన్, సౌకర్యత, సాంకేతిక అందజేతల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది” అన్నారు.
“సి-క్లాస్ ఇప్పటికే ఇంకా ఆవిష్కరణకు ముందుగానే కూడా కస్టమర్లలో గణనీయమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది” అంటూ శ్రీ ష్వెంక్ గారు జోడించారు. వారి విశ్వసనీయతను, కారు కోసం వారు సుదీర్ఘకాలం వేచి ఉండటాన్ని గౌరవిస్తూ, మేము మొట్టమొదటిసారిగా కొత్త సి-క్లాస్ బుకింగులను ప్రత్యేకించి మాకు ప్రస్తుతమున్న మెర్సిడిస్-బెంజ్ కస్టమర్లకు మాత్రమే ప్రారంభిస్తున్నాము. కొత్త సి-క్లాస్ కారు ఈ విభాగాన్ని పునర్నిర్వచించగలదని మరియు లగ్జరీ సెడాన్ విభాగములో మా నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ తన కస్టమర్ ప్రాధాన్యతను కొనసాగిస్తుందని మేము అత్యంత ఆత్మవిశ్వాసముతో ఉన్నాము.”