Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 38,462 కోట్ల రూపాయలకు చేరింది
న్యూఢిల్లీ : వ్యాపార వాతావరణం లో గణనీయంగా వృద్ధి కనిపిస్తోంది. హౌసింగ్ విభాగంలో విస్తృత శ్రేణిలో సాంకేతికత వినియోగించడంతో పాటుగా రికవరీ కూడా కనిపిస్తుంది. లోన్ డిస్ట్రిబ్యూటర్ ఆండ్రోమెడా యొక్క లోన్ డిస్బర్శల్స్ దాదాపు 1.5 రెట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి చెందడంతో పాటుగా 38,462 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ కంపెనీ 2022–23 ఆర్ధిక సంవత్సరంలో 60వేల కోట్ల రూపాయల లక్ష్యం విధించుకుంది.
ఆండ్రోమెడా ప్రస్తుతం 90 నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలోనే ఇది 115 నగరాలకు విస్తరించనుందని ఆండ్రోమెడా కో–సీఈవో రౌల్ కపూర్ అన్నారు. గృహ కొనుగోలుదారులకు అతి సులభంగా ఋణాలను అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్ధిక వ్యవస్థ మందగించినప్పటికీ ప్రస్తుతం ఆర్బీఐ, ఆర్ధిక మంత్రిత్వశాఖ తీసుకున్న కార్యక్రమాలతో పాటుగా వేగవంతంగా టీకాలు వేయడం కూడా ఆర్ధిక వ్యవస్ధ పునరుత్తేజానికి తోడ్పడిందన్నారు.
తాము లోన్ డిస్బర్శల్స్ను 15,575 కోట్ల రూపాయల నుంచి 38,462 కోట్ల రూపాయలకు వృద్ధి చేయడం ద్వారా 147% వృద్ధి నమోదు చేశామన్నారు. సాంకేతికత మద్దతుతో పాటుగా తమ కార్యకలాపాల ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 60,654 కోట్ల రూపాయల లోన్ డిస్బర్శల్స్ చేయనున్నట్లు తెలిపారు. గృహ ఋణాలు, వినియోగదారులు , వ్యాపార ఋణాలు వ్యాప్తంగా తాము వృద్ధి నమోదు చేస్తున్నామన్నారు. మార్చి 2022 నాటికి తాము గృహ ఋణాల పరంగా 17,993 కోట్ల రూపాయల వితరణ చేయగా, ఈ సంవత్సరం 28,996 కోట్ల రూపాయల ఋణాలు అందించడానికి లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించారు. ఇదే రీతిలో లోన్ ఎగైనెస్ట్ ప్రోపర్టీ ఋణాలు 13,060 కోట్ల రూపాయలు ఉంటే, 2022–23 కోసం 17,848 కోట్ల రూపాయల ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.