Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : హాంకాంగ్ కు చెందిన, రూ.25 కోట్ల టర్నోవర్ కలిగిన హాంకాంగ్ కన్ఫెక్షినరీ అగ్రగామి యూ ఫుడ్స్ యోలీ యోలా బ్రాం డ్ కింద దక్షిణ భారతీయ మార్కెట్లోకి నోరూరించే విస్తృత శ్రేణికి చెందిన ఎగ్జయిటింగ్, ఫ్లేవర్ తో కూడిన, వినూత్న కన్ఫెక్షినరీ ఉత్పాదనలను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించింది. వేగంగా దూసుకెళ్తు న్న కన్ఫెక్షినరీ మార్కెట్లోకి ప్రవేశించేందుకు, ఈ విభాగంలో భారీ వాటా పొందేందుకు కంపెనీ చేస్తున్న గట్టి ప్రయత్నాల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. యు ఫుడ్స్ ఇండియా ప్రై.లి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అద్వైత్ ప్రధాన్ నేడు ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపారు.
'యోలీ యోలా, ఫ్రుబాల్ బ్రాండ్ల కింద కంపెనీ విస్తృత శ్రేణిలో రుచికరమైన, వినూత్న కన్ఫెక్షినరీ ఉత్పాదన లను ప్రవేశపెట్టనుంది. సాఫ్ట్ క్యాండీలు, లాలీపాప్ లు, చాకొలెట్ బాల్స్, హ్యాపీ బీన్స్, కప్ జెల్లీస్ లాంటివి ఇందులో ఉండనున్నాయి. మీ రుచిబొడిపెలకు ఆనందం కలిగించేలా యోలీ యోలా సాఫ్ట్ క్యాండీలు నా లుగు నూతన ఫ్లేవర్స్ తో సహా స్ట్రాబెర్రీ, లిచి, గవా, రా మ్యాంగో, కోలా లెమన్ మింట్, అల్ఫాన్సో మ్యాం గో, ఇమ్లీ వంటి రుచుల్లో రానున్నాయి. వీటి ధరలు రూ.1 మొదలుకొని రూ.300 దాకా ఉంటాయి.
తీపి రుచి కోసం ఎగ్జయిటింగ్, టేస్టీ యోలీ యోలా లాలీపాప్ శ్రేణిని రుచి చూడడం మరిచిపోవద్దు. ఇవి ఐ దు ఎగ్జయిటింగ్ రుచుల్లో లభిస్తాయి. స్ట్రాబెర్రీ, లిచి, గవా, ఇమ్లీ, కోకోనట్ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 5 మొదలుకొని రూ.120 దాకా ఉంటుంది.
వినియోగదారులకు యోలీ యోలా చాకొలెట్ బాల్స్ ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. రుచిగా, క్రీమీగా, నో ట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఇవి ఉంటాయి. అథెంటిక్ కోకో రుచితో ఉంటాయి. ఒకటి తింటే చాలు... ఇంకా కావాలని అడుగుతారు. వీటి ధరలు రూ.10 మొదలుకొని రూ.75 దాకా ఉంటాయి.
యోలీ యోలా హ్యాపీ బీన్స్ కూడా లభిస్తాయి. ఇవి క్యాండీలకు భిన్నంగా ఉంటాయి. స్ట్రాబెర్రీ, లిచి, గవా, బ్లూ బెర్రీ లాంటి పలు రుచుల్లో లభిస్తాయి. వీటి ధర రూ.10 నుంచి రూ.50 దాకా ఉంటుంది.
ఇక ఒక వినూత్న ఉత్పాదన రంగురంగుల యోలీ యోలా ఫ్రుబాల్ కప్ జెల్లీలు. ఇవి కచ్చితంగా మీ మన స్సులను కొల్లగొడుతాయి. వీటిని డెజర్ట్స్ గా కూడా వినియోగించవచ్చు. ఎనిమిది విభిన్న రుచుల్లో ల భ్యం. వెల రూ.5 మొదలుకొని రూ.300 దాకా ఉంటుంది.
మా ఉద్వేగభరిత పోర్ట్ ఫోలియోలో మరో వినూత్నత ఫుల్పీ. ఇది ఫ్రూట్ క్రష్. మీ ఆహారాన్ని మరింత రుచి కరమైందిగా, యమ్మీగా, ఫ్లేవరబుల్ గా చేసే ఎనీ టైమ్ ఫ్లేవరింగ్ సిరప్.
యోలీ యోలా బ్రాండ్ కింద చాకో బమ్, కోకో బమ్ కూడా ఉన్నాయి. ఇవి హార్డ్ బాయిల్డ్ క్యాండీస్ విభాగా నికి చెందినవి.
ఈ ఆవిష్కరణల సందర్భంగా యు ఫుడ్స్ ఇండియా ప్రై.లి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అద్వైత్ ప్రధాన్ మా ట్లాడుతూ, 'మా ప్రాథమ్యాల జాబితాలో భారత్ ఎంతో పైస్థాయిలో ఉంది. నాణ్యత, వినూత్న కన్ఫెక్షినరీ ఉ త్పాదనల విషయానికి వస్తే దేశం ఇంకా అండర్ సర్వ్ డ్ మార్కెట్ గానే ఉందని మా విస్తృత అధ్యయనా లు సూచించాయి. నేడు వినియోగదారులు నిరంతరం ఉత్పాదనల్లో కొత్తదనం కోసం చూస్తున్నారు. యూ ఫుడ్స్ అనేది ముమ్మర ఉత్పాదన పోర్ట్ ఫోలియోతో ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందిన, చక్కగా నిలదొక్కుకున్న బ్రాండ్. కన్ఫెక్షినరీ విభాగంలో ఇది తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఉ త్పాదనల్లో రుచి, ఫ్లేవర్స్, విలక్షణ ప్యాకింగ్ లాంటి ప్రత్యేకతలకు ఇదెంతగానో పేరొందింది. వినియోగదారు లకు నాణ్యత, వినూత్నత, అదనపు ఆనందాన్ని అందించడమే యు ఫుడ్స్ లో మాకు చోదకశక్తులుగా ఉన్నాయి. అభివృద్ధి చెందేందుకు భారతదేశంలో ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఇక్కడ మా ప్రవేశం ఎంతో వ్యూహాత్మకమైంది. మేం కుండ్లి లోని అత్యాధునిక ఫ్యాక్టరీలో ఆయా ఉత్పాదనలను తయారు చే స్తాం. కార్యకలాపాల మొదటి దశలో మేం మా ప్లాంట్ పై రూ.100 కోట్లు వెచ్చించాం. మా ప్లాంట్ హెచ్ఏఏ సీసీపీ ఆమోదం పొందింది. సంబంధిత ఐఎస్ఒ ధ్రువీకరణలు పొందింది. కఠిన నాణ్యతా నిబంధనలను పా టిస్తుంది. మేం చక్కటి ఉపకరణాలు కలిగిన ఆర్ అండ్ డి లేబొరేటరీ కలిగిఉన్నాం. మేం నిరంతరం వినూ త్నత సాధించేందుకు, మా ఉత్పాదనలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుంటాం. భారతీయ వినియోగదా రులకు మా ఉత్పాదనలను అందుబాటులోకి తీసుకెళ్లేందుకు మేం విస్తృత స్తాయి పంపిణి నెట్ వర్క్ ను కూడా కలిగిఉన్నాం. మా ఉద్వేగభరిత పోర్ట్ ఫోలియో ఎంతో ప్రభావశీలకంగా ఉంటుంది. భవిష్యత్ లో మరిన్ని ఉత్పాదనలను జోడించాలని మేం భావిస్తున్నాం` అని అన్నారు.
'ఈ మహమ్మారి కార్యకలాపాలకు విఘాతం కలిగించి మందగింపజేసినప్పటికీ, ట్రయల్స్ నిర్వహించడం లో, ఆర్ అండ్ డి ద్వారా వినూత్నత సాధించడంలో, మీ - టూ తరహాలో గాకుండా ప్రత్యేకమైన, రుచికర మైన ఉత్పాదనలను తీసుకు వచ్చేందుకు గాను శాంప్లింగ్ నిర్వహించడంలో మేం గొప్ప అవకాశాలను పొం దగలిగాం` అని అన్నారు.
యు ఫుడ్స్ ఇండియా ప్రై.లి. మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ శ్రీ ప్రాదేశ్ లెంకా సంస్థ మార్కెట్ వ్యూహం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, '2022లో భారతీయ కన్ఫెక్షినరీ మార్కెట్ విలువ రూ.14,000 కోట్లు (నెల్సన్). 12.25% చొప్పున ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న మార్కె ట్లలో భారత్ ఒకటి. చాకొలెట్ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో క్యాండీ విక్రయాలు కీలకంగా ఉన్నట్లు ఇటీవలి ధోరణులు తెలియజేస్తున్నాయి. దేశంలో యువత జనాభా అధికంగా ఉండడం అనేది చాకొలెట్స్ ఒక కీలక వినియోగదారు విభాగం అనేదాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం భారతదేశం మొత్తం జనాభాలో సగం మంది 25 ఏళ్ల లోపు వారు మరియు మూడింట రెండు వంతుల మంది 35 ఏళ్ల లోపు వారు. మార్కెట్ ను ముందుకు తీసుకెళ్తున్న ఇతర శక్తుల్లో మారుతున్న జీవనశైలులు, పాశ్చాత్యీకరణ, ఆహార సేవా రంగం వృద్ధి, విలువ జోడింపు లాంటివి ఉన్నాయి. ఈ అంశాలన్నింటి కారణంగా సంప్రదాయక మిఠాయిల స్థానాన్ని చాకొలెట్స్ భర్తీ చేస్తున్నాయి. అందుకే దేశంలో కన్ఫెక్షినరీ మార్కెట్ పట్ల దృక్పథం ఎంతో ఆశావ హంగా ఉంది` అని అన్నారు.
'నేడు భారతదేశం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. వినియోగదారు రాజు. మార్కెట్లో ఎంతో పోటీ ఉంది. మేం మా ప్లాంట్ లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నందున ఇతర ఉత్పాదనలతో పోలిస్తే యోలి యోలా ఉత్పాదనలు భిన్నంగా ఉంటాయి. మేం గో-టు- మార్కెట్ ధోరణిని అనుసరిస్తాం. వినియోగ దారుల అవసరాలను అర్థం చేసుకునేందుకు మార్కెట్ డైనమిక్స్ మదింపు వేస్తాం. మా ఉత్పాదన పోర్ట్ ఫోలియో భారీగా ఉంది. రుచి, ఫ్లేవర్, ప్యాకేజింగ్ లాంటి భవిష్యత్ ధోరణులను దృష్టిలో ఉంచుకొని మేం మా ఉత్పాదనలను అభివృద్ధి చేశాం. మా యోలి యోలా క్యాండీలు ఫ్లేవర్డ్. సరైన ఫ్లేవర్ ను, తియ్యదనాన్ని అవి అందిస్తాయి. మార్కెట్లో మారే బ్రాండ్ కూడా ఇవ్వని విధంగా చిన్నారులకు ప్రమోషనల్ టాయ్స్ తో ఇవి లభించనున్నాయి. యోలి యోలా చాకొలెట్ బాల్స్ బాగా మైల్డ్ గా ఉన్నప్పటికీ అసలైన కోకో రుచితో ఉంటాయి. అతుక్కుపోకుండా, తేలికగా, ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి. అంతేకాదు, బాగా అందుబాటు ధరలో కూడా ఉంటాయి. రంగురంగుల యోలి యోలా ఫ్రుబాల్ జెల్లీ కప్స్ అనేవి అసలైన వినూత్నత. వీటిని డె జర్ట్స్ మాదిరిగా ఏ సమయంలోనైనా, ఎక్కడైనా తినవచ్చు. యోలి యోలా హ్యాపీ బీన్స్ అనేది ఓ హిట్ ఉ త్పాదన. స్ట్రా బెర్రీ, లిచి, గవా, బ్లూ బెర్రీ లాంటి పలు రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతుంది` అని అన్నారు.
దక్షిణ భారతదేశంలో రోల్ అవుట్ ప్రణాళిక గురించి శ్రీ లెంకా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, 'మా ఉత్పాదనలు దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. ఉత్తరం నుంచి పశ్చిమం దాకా ప్రారం భించి, ఇప్పుడు మేం దక్షిణ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. మార్కెట్ లో మాకు లభించిన ఆరంభ స్పందన ఎంతో సానుకూలంగా ఉంది. అది మా ఆత్మవిశ్వాసాన్ని అధికం చేసింది. దక్షిణ భారతదేశంలో మేం విస్తారిస్తామని, నిలదొక్కుకుంటామని మేం విశ్వసిస్తున్నాం. మోడర్న్ రిటైల్ ట్రేడ్, అదే విధంగా జనరల్ ట్రేడ్...రెండిట్లోనూ మేం కార్యకలాపాలు కొనసాగిస్తాం. భారతదేశవ్యాప్తంగా మేం పటిష్ఠ నెట్ వర్క్ రూపొందించుకున్నాం. ఆరంభంలోనే యోలి యోలా 42000 అవుట్ లెట్స్ లో దర్శనమివ్వనుంది. మేం అంకితభావంతో కూడిన బ్రాండ్, దూకుడుగా దూసుకెళ్లే, లక్ష్యాన్ని సాధించాలనే తపన గల సేల్స్ జట్టును కలిగిఉన్నాం. మేం మా ప్రమోషనల్ బడ్జెట్స్ మొదటి దశపై సుమారుగా రూ.3 కోట్లు వెచ్చిస్తున్నాం. సమీ ప భవిష్యత్ లో నూడుల్స్, సిరప్ ఆధారిత ఉత్పాదనలను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాం` అని అన్నా రు.