Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెయన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ సీఎండీ వెల్లడి
- ఏప్రిల్ 27న ఐపీఓ
హైదరాబాద్ : వచ్చే మూడేళ్లలో రూ.170 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్ చెయిన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రమేష్ కంచర్ల తెలిపారు. ఈ నెల 27న ఆ సంస్థ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాము ఆరు నగరాల్లో 14 ఆస్పత్రులు, మూడు క్లినిక్‌లను కలిగి ఉన్నామన్నారు. 1500 పడకల సామర్థ్యం.. 641 పూర్తి సమయం వైద్యుల సేవలను కలిగి ఉన్నామన్నారు. గడిచిన ఐదేండ్లలో ప్రతీ ఏడాది సగటున రోగుల రాకలో 20 శాతం వృద్ధి చోటు చేసుకుంటుందన్నారు. వచ్చే మూడేండ్లలో 500 బెడ్లను జోడించనున్నామన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఐపీఓ ఈ నెల 27 నుంచి 29 వరకు తెరిచి ఉంటుందన్నారు. షేర్ల ధరల శ్రేణీని రూ.516 నుంచి రూ.542గా ఆ సంస్థ నిర్ణయించింది. కనీసం 27 షేర్లకు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా రూ.280 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నిధులను ఎన్సీడీల ముందస్తు చెల్లింపులకు, నూతన హాస్పిటళ్ల ఏర్పాటు, వైద్య పరికరాల కొనుగోళ్లతో పాటుగా సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ ఐపీఓలో ప్రమోటర్లు రమేష్ కంచర్ల, దినేష్ కుమార్ చీర్ల, ఆదర్శ్ కంచర్ల సహా ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన పద్మ కంచర్ల, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా వాటాలు విక్రయించనున్నారు.