Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని హెలిక్యాప్టర్ సర్వీసుల సంస్థ పవన్ హాన్స్ లిమిటెడ్ ప్రయివేటీకరణకు సంబం ధించిన బిడ్డింగ్ నేడు ఖరారు కానుందని సమాచారం. ఈ కంపెనీని చేజిక్కిచుకోవడం కోసం జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ పోటీలో ఉన్నాయి. శనివారం కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ ఆధ్వర్యంలో పవన్ హాన్స్ ప్రయివేటీకరణ బిడ్డింగ్ విజేత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం. మంత్రివర్గ ప్యానెల్ ఆమోదం తర్వాత దీనిపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై కేంద్ర ఆర్థిశాఖ వర్గాలు, పవన్ హాన్స్ ప్రతినిధి స్పందించలేదు. మోడీ సర్కార్ ఇటీవలే ఎయిరిండియాను టాటా గ్రూపునకు అమ్మేసింది. ఈ ఏడాది మరో ఐదు పీఎస్యూలను కార్పొరేట్లకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, ఐడీబీఐ బ్యాంక్లు ఉన్నాయి.