Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పలు సంవత్సరాలుగా, భారతదేశంలోని బాలల కోసం అన్ని విషయాల్లోనూ వినోదాన్ని అందించేందుకు ఒన్-స్టాప్ గమ్యస్థానంగా నికెలోడియన్ ఉద్భవించింది. యువ, బాలల మనస్సులను అలరిస్తానన్న తన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ, తమ అభిమాన సూపర్ కిడ్స్ శివ మరియు రుద్ర తొలిసారిగా యానిమేషన్ చిత్రం ‘రుద్ర అండ్ శివ వర్సెస్ పైరేట్స్ ఆఫ్ యూనివర్స్’ కోసం చేతులు కలిపారు. ఇది 24 ఏప్రిల్ 2022న, ఆదివారం ఉదయం 11.30కు నిక్ మరియు డిజిటల్ డెస్టినేషన్ వూట్ కిడ్స్‌లో ప్రసారం కానుంది. పైరేట్స్ ఆఫ్ ది యూనివర్స్ దుష్ట ఉద్దేశాలను అరికట్టేందుకు ఒక సాహసోపేతమైన మిషన్‌ను ప్రారంభించినప్పుడు రుద్ర మరియు శివ జతకట్టడాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. లార్డ్జా అనే గ్రహాంతర వాసి, తన సైన్యాన్ని మరింత బలోపేతం చేసే చిప్‌ను కనిపెట్టడం కోసం, తమ ప్రత్యేకమైన ప్రతిభను వెలికితీసేందుకు మానవులను అపహరించిన తర్వాత ఇంటర్-ప్లానెట్ పోలీసుల లక్ష్యం అవుతుంది. అతని చెడు ప్రణాళిక ఫలించిందని నిర్ధరించుకునేందుకు, అతను మ్యాజిక్ స్కూల్లోని జై సింగ్, సర్ మెజెస్టికో, షకల్ మరియు ఇతర ఉపాధ్యాయులను కిడ్నాప్ చేస్తాడు. లార్డ్జా మాస్టర్ ప్లాన్‌ను అడ్డుకునేందుకు రుద్ర మరియు శివ ఆ గ్రహాంతరవాసిని ఓడించి, అతని వద్ద బందీలుగా ఉన్న మాయా పాఠశాలకు చెందిన బంధీలు అందరినీ రక్షిస్తారు.