Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఇంజనీరింగ్, టెక్నాలజీ కంపనీ సైయంట్ కొత్తగా ఫిన్లాండ్ కేంద్రంగా పని చేస్తున్న సిటెక్ను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. రూ.800 కోట్లు చెల్లించి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సైయంట్ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సంస్థల్లో ఇదే పెద్దది కావడం విశేషం. 35 ఏండ్ల క్రితం స్థాపించిన ఈ కంపెనీ ఇంధనం, మైనింగ్, ప్రాసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, తయారీ పరిశ్రమలకు ఇంజనీరింగ్ సేవలంది స్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వచ్చే జూన్ ముగింపు నాటికి ఈ ఒప్పందం పూర్తి కానుంది.