Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఎస్బీఐ తన నూతన శాఖను ఏర్పాటు చేసింది. సోమవారం దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సలోని నారాయన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, అధికారులు జోగేష్ చంద్ర సాహు, క్రిష్ణన్ శర్మ, శ్రీరామ్ సింగ్, నీరజ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యా, వాహన రుణ గ్రహీతలకు సలోని నారాయణన్ జారీ పత్రాలను అందజేశారు. ఈ శాఖ తమ ఖాతాదారుల వ్యక్తిగత, ఎస్ఎంఇ అవసరాలను తీర్చనుందన్నారు.