Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కోలు ఇప్పటికే పలుమార్లు మొబైల్ చార్జీలు పెంచగా.. త్వరలో మరోసారి వినియోగదారులపై భారం మోపే పనిలో ఉన్నాయని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా అమాంతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటనూనెల ధరలతో బెంబెలెత్తుతున్న ప్రజలకు టెల్కోలు రీచార్జ్ టారీఫ్‌లు పెంచి చుక్కలు చూపించే పనిలో ఉన్నాయని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. గతేడాది నవంబర్లోనే రిలయన్స్ జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలు 25 శాతం మేర టారీఫ్‌లు పెంచాయి. ముఖ్యంగా తక్కువ టారిఫ్ ప్లాన్ల విలువను పెంచడం ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి.