Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు సెషన్లలో భారీ నష్టాలను చవి చూశాయి. దీంతో మదుపర్ల సంపద రూ.6.47 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయింది. శుక్రవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 714 పాయింట్లు పతనం కాగా.. సోమవారం ఈ సూచీ మరో 617 పాయింట్లు క్షీణించి 56,579కి పడిపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు ప్రపంచచ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ఏడాదికి పైగా కొనసాగుతున్న రియలన్స్, ఫ్యూచర్, అమెజాన్ ఒప్పందం రద్దు కావడంతో ఫ్యూచర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక్క పూటలోనే 20 శాతానికి పైగా క్షీణించాయి. మరోవైపు రిలయన్స్ షేరు ధర కూడా 2.4 శాతం మేర నష్టపోయింది. రెండు సెషన్లలో బిఎస్ఇ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.6,47,484 కోట్లు కరిగిపోయి రూ.2,65,29,671 కోట్లకు పడిపోయింది. సోమవారం సెషన్లో ఎన్ఎస్ఇ నిఫ్టీ 218 పాయింట్లు తగ్గి 16,953 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.88 శాతం చొప్పున తగ్గాయి.